CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏటూరు నాగారం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి కేక్ కట్ చేసి 131వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఏటూర్ నాగారం టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గడ దాసు సునీల్ కుమార్ మాట్లాడుతూ.స్వతంత్ర భారతదేశం ప్రజాస్వామ్య పరిపాలన మూల స్తంభమైన రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ జయంతి ఒక కులానికో మతానికి సంబంధించింది కాదని ఇది దేశ ప్రజలందరిది అని రాజ్యాంగం ప్రకారం దేశంలో రాష్ట్రంలో పరిపాలన సజావుగా జరుగుతుందని,అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరూ అంకితభావంతో పునరంకితం కావాలని అన్నారు.అప్పుడే దేశంలో పేదరికం పోయి సమానత్వం వస్తుందని పేదలు దళితులు మధ్య ఆంతర్యం జరగకూడదని అందరికీ సమానమైన ఆర్థిక సామాజిక వ్యవస్థ ఉండాలని అప్పుడే అంబేద్కర్ ఆశయాలను కొనసాగించిన వాళ్లము అవుతామని అన్నారు. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా కెసిఆర్ పరిపాలన కొనసాగుతోందని అభివృద్ధి సంక్షేమ రంగాలలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచి గా మారిందని, అన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పి కోఆప్షన్ సభ్యులు ఎండి వలి యాబీ సలీం,పి ఎ సి ఎస్ చైర్మన్ కునూరు అశోక్ గౌడ్, ఏటూరు నాగారం సర్పంచ్ ఈసం రామ్మూర్తి, ఎంపీటీసీ సభ్యులు కుమ్మరి స్వప్న చంద్రబాబు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మ మల్లారెడ్డి,సప్పిడి రామనర్సయ్య,దడిగల సమ్మయ్య,ధనపు నేని కిరణ్ కుమార్,మండల సోషల్ మీడియా ఇంచార్జ్ జాడి బోజ రావు, అనుబంధ సంఘాల అధ్యక్షులు వావిలాల రాంబాబు,బట్టు రమేష్,గార ఆనంద్,ఈసం స్వరూప,ఏ సి ఎస్ డైరెక్టర్ మాధరి రామయ్య, రామన్నగూడెం సర్పంచి దొడ్డ కృష్ణ,బండి లక్ష్మి,సంఘం లక్ష్మి, ఎస్.కె మహబూబి, కాళ్ల రామకృష్ణ,కందకట్ల శ్రీనివాస్, తాళ్లపల్లి మోహన్,కొండాయి చిన్ని,వెంకన్న,ఎండి బాబా, కొండ గొర్ల రాజేష్,దాసరి శేఖర్, గాదె నరేష్,పాలకుర్తి విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: