CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ రైతు కు అండగాసీఎం కేసీఆర్.

Share it:

 


  • యాసంగి వరి ధాన్యం కొనుగోలు ప్రకటనపై రైతులసంబరాలు 

మన్యం మనుగడ,పినపాక:

 ఏడూళ్ల బయ్యారం క్రాస్ రోడ్డులో గల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేయడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ గారు స్పందించి రైతులు పండించిన ధాన్యాన్ని మొత్తం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ కేసీఆర్‌ చిత్ర పటానికి బుధవారం పాలాభిషేకం చేశారు. 

ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి మాట్లాడుతూ...

రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్‌,పినపాక ఎమ్మెల్యే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు గారి భాగస్వాములుగా ఉన్న తెలంగాణ ప్రభుత్వం రైతులకు అనుకూలంగా రైతుబంధు,రైతుభీమా, సాగునీరు, విత్తనాలు, ఎరువులు సరఫరా, పంటకు గిట్టుబాటు ధర తదితర పధకాలు రైతులకు ఉపయోగపడేలా ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ గారిదన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకపోయినా రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ నిలబడిందన్నారు. 

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుమ్మడి గాంధీ, సొసైటీ చైర్మన్ ముదునూరి రవివర్మ,రైతు బంధు సమితి మండల అధ్యక్షులు దొడ్డా శ్రీనివాసరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ బత్తుల వెంకట్ రెడ్డి, సర్పంచ్ లు కోరం రజిని, బాడిశా మహేష్, ఎంపీటీసీ చింతపండు సత్యం, మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్కే .జాంగిర్, టిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు దాట్ల వాసు బాబు, డాక్టర్ శ్రీ రామ్, ముక్కు వెంకటేశ్వర రెడ్డి, ముక్కు నాసర్ రెడ్డి, కొండేరు నాగభూషణం, దినపరపు శ్రీనివాస్ రెడ్డి, గుణ గంటి సమ్మయ్య, సాగిరాజు బుల్లిబాబు, బెడద సురేందర్, కురుకురి శ్రీనివాసరావు, వడ్ల కొండ శీను, ఎస్ కే. మీరా సాహెబ్,కంది సుధాకర్ రెడ్డి, సోంపల్లి తిరుపతి, గుండం దామోదర్, సత్యనారాయణ , గాండ్ల అశోక్, గుమ్మడి అశోక్, ప్రవీణ్, శ్యామల సతీష్, రవితేజ, రాము, మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ,అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: