CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వేతనాల చెల్లింపులో జాప్యం నిరసిస్తూ ఐ ఎఫ్ టి యు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరైన కొండాపురం సి ఎస్ పి కాంట్రాక్ట్ కార్మికులు.అధికారులకు వినతిపత్రం అందచేత.

Share it:

 



మన్యం మనుగడ,మణుగూరు:

  వేతనాల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్(ఐ ఎఫ్ టి యు) ఆధ్వర్యంలో కొండాపురం సి ఎస్ పి కాంట్రాక్ట్ కార్మికులు బుధవారం నాడు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు కొద్దిసేపు కార్యాలయం ఆవరణలో ఆందోళన నిర్వహించారు సమస్యను పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సకాలంలో వేతనాలు చెల్లించేలా చూస్తామని అధికారుల బృందం హామీతో కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళన విరమించారు అనంతరం కొండాపురం సి ఎస్ పి డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM) యస్ సురేష్ , నిరంజన్, వేణుగోపాల్ గార్లకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టి.యు ఏరియా అధ్యక్షులు ఏ మంగీలాల్ మాట్లాడారు

         సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ మణుగూరు ఏరియా కొండాపురం సి ఎస్ పి లో ఈ రోజు అనగా 13వ తేదీ నాటికి కూడా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి ఎవరి జీవితాలు కూడా బ్యాంకు ఖాతాలో జమ కాలేదని సాధారణంగా కోల్ బెల్ట్ ప్రాంతాలలో3వ తేదీ నుండి 10వ తేదీ లోగా ఇంటి కిరాయి కరెంటు బిల్లు,పిల్లల స్కూలు ఫీజులు, చిన్నపాటి చిట్టీలు అప్పుల వాళ్లకు చెల్లించే వడ్డీలు ఇలా అనేక లావాదేవీలు ఈ సమయంలోనే జరుగుతాయి పదో తేదీ నాటికి కూడా జీతాలు బ్యాంక్ ఖాతాలో జమ కావడం లేదని కొన్ని సందర్భాలలో బిల్లు కావటం లేటు కావటంతో కాంట్రాక్టర్ లు వేతనాలు బ్యాంకులో జమ చేయడం లేదని దీనికితోడు ఏదో ఒక సమస్యతో బ్యాంకులకు సెలవులు ప్రకటించడం అలా 20వ తేదీ కూడా దాటిపోతోంది, దీంతో ఇంట్లో గృహిణుల ఇబ్బందులు చెప్పనలవి కాదు ఈ సమస్యలన్నీ యాజమాన్యానికి తెలియనివి కావని అయినా కూడా కాంట్రాక్టర్ నడిగితే యాజమాన్యానిది లోపమని అధికారులు నడిపితే కాంట్రాక్టర్లది లోపమని ఎండని చేప సామెతను గుర్తు చేస్తున్నారని ఆయన వాపోయారు, ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి కొండాపురం సి ఎస్ పి అన్ని విభాగాల కాంట్రాక్టు కార్మికులతో పాటు ఏరియాలోని పికె ఓసి , మణుగూరు ఓసి , ఓసి స్టోర్స్, పివి కాలనీ పారిశుద్ధ్యం మరియు ఇతర విభాగాల కాంట్రాక్ట్ కార్మికుల వేతనాలు సకాలంలో వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యేలా తగు చర్యలు చేపట్టాలని దీనిపై ఏరియా జిఎం జక్కం రమేష్ గారు సీరియస్ గా స్పందించమని ఆ వినతిపత్రంలో కోరామన్నారు ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు నాయకులు సంజీవ్, వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, సూపర్వైజర్లు టీ వీరభద్రం, లక్ష్మీనారాయణ, పిచ్చయ్య,మరియు కాంట్రాక్ట్ కార్మికులు జానయ్య, నాగరాజు, వెంకటేశ్వర్లు, పూసల భద్రం, లింగయ్య, రవి, కృష్ణ, చలపతి, వినోద్, నరసింహారావు సుబ్బారావు, వెంకటేశ్వర్లు ,మధు, ఏలియా,ఆనంద్ సాంబయ్య, వీరయ్య ,అరుణ ,రమణ ,శ్రీలత ,దుర్గ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: