CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మోడీ ప్రభుత్వం కొనకున్న మద్దతు ధరకు వరి ధాన్యం కొనుగోళ్లుచేస్తాం.రైతులు అధైర్యపడవద్దు.

Share it:

 



  • తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది
  • రైతు బాంధవుడు సీఎం కేసీఆర్
  • విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతరావు

 మన్యం మనుగడ,భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి: యాసంగి వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తెలిపారు.

  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

 రైతుల పక్షాన నిలిచి, ధాన్యం కొనుగోలుకు ముందుకు వచ్చిన సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిగా నిలిచారని అన్నారు.కేంద్ర ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యంతో తెలంగాణ రైతులకు అన్యాయం జరగకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని తగిన నిర్ణయం తీసుకున్నారని అన్నారు.

 ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందన్నారు, రైతుల కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ గారికి ప్రజలు అండగా ఉంటారన్నారు, రైతుల మేలు కోరే ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మేనని అన్నారు.

 రైతులు తక్కువ ధరలకు ధాన్యం అమ్మవద్దని ఆయన సూచించారు, రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు, క్వింటాలుకు రూ.1960 ధర నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.

Share it:

TS

Post A Comment: