CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అంబేద్కర్ ఆశయాలను యువత కొనసాగించాలి--:ఎస్ ఐ తాహెర్ బాబా.

Share it:


మన్యం మనుగడ, మంగపేట.

ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రం లో డా,బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి మంగపేట మండలం లో అంబేద్కర్ కమిటీ హాల్ ఆవరణలో అంబేద్కర్ సంఘం మండల కార్యదర్శి బసరకానీ హరికృష్ణ ఆద్వర్యంలో జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా మంగపేట తహసీల్దార్ ఎండి సలీం, మంగపేట ఎస్ఐ తాహెర్ బాబా, డిప్యూటీ తహసీల్దార్ సురేష్ బాబు, సొసైటీ చైర్మన్ తోట రమేష్,అంబేద్కర్ సంఘము సీనియర్ నాయకులు పగిడిపెళ్లి వెంకటేశ్వర్లు ఎంపెళ్లి సమ్మయ్య, పచ్చ శేషగిరిరావు, వైకుంఠం, తాటి కృష్ణ 

,ఎర్రం స్వామి, బుట్టో, పాషా, చిలకమర్రి లక్ష్మయ్య తదితరులు అతిధులుగా హాజరైనారు.ఈ సందర్బంగా మంగపేట పోలీస్ స్టేషన్ ఎస్ఐ తాహెర్ బాబా మాట్లాడుతూ డా భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ అంటేనే ఒక సామజిక, ఆర్ధిక, రాజకీయ విప్లవం అని, కుల, మతాలకు అతీతంగా బహుజనులు ఏకం కావాలని, విద్య ద్వారానే అన్నింటిని సాధించవచ్చని, నిర్భయంగా చెప్పిన వ్యక్తి, భారత రాజ్యాంగ నిర్మాణం చేసి తద్వారా దేశానికి దిశ నిర్దేశం చేసిన అపర మేధావి డా :భీమ్ రావ్ అంబేద్కర్, ఆయన విగ్రహాలు నిర్మించటమే కాదు, ఆ మహానుభావుడి ఆశయాలు ప్రజల్లోకి తీసుకొని వెళ్లి ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచనలు చేశారు. ఈ సందర్బంగా అతిధులు గా హాజరు అయిన నాయకులు, అంబేద్కర్ వాదులు మాట్లాడుతూ డా :అంబేద్కర్  

నాటి సమాజంలో అణచివేత,గురించి మాట్లాడటం జరిగింది.కులవివక్ష, చిన్నచూపునకు గురైన అంబేద్కర్‌ ప్రపంచ దేశాలకు వెళ్లి ఎవరూ సాధించలేని ఉన్నత చదువులు చదివి,భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించారని అన్ని వర్గాల ప్రశంసలు పొందారన్నారు. ఏ వర్గమైనా అంబేద్కర్‌ జీవిత పాఠాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ మండల నాయకులు లంజపెళ్లి ముత్యాలు, వెంపెళ్లి వీరస్వామి,యాదగిరి, జాడి సాంబశివరావు, బసారికని నాగార్జున్,దుర్గం నర్సింహారావు, రామచంద్ర0, గుగ్గిళ్ల సురేష్, మోదుగు బాబు, పుల్లూరి తిరుపతి గారు బొడ బొర్రయ్య, చొప్పల తిరుపతి, దాసరి ఎల్లయ్య, చెట్టుపల్లి ముకుంధం,గొప్ప సమ్మరావు, కాస్ప ముకుందాం, దాసరి నరేష్, దాసరి శ్యామ్ బాబు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: