CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా నిలిచిందని అభివృద్ధిలో కొత్తపంథాను అవలంబిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైనముద్రను వేస్తున్నాడని ఖమ్మం పార్లమెంట్ మాజీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించి, ఇటీవల చనిపోయిన బాధిత కుటుంబాలను పరామర్శించారు. పోకలగూడెం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకుని పరామర్శించి, అనారోగ్యానికి గల కారణాలను అడిగి తెలుసుకుని అండగా ఉంటానని భరోసా కల్పించారు. పదవులు ఉన్న లేకున్నా కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసా కల్పించారు. అనంతరం అయ్యన్నపాలెం గ్రామంలో జరిగిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ... కాలేశ్వరం ప్రాజెక్ట్ తక్కువ కాలంలో పూర్తిచేసి తాను కలలు గన్న తాగునీటి సరఫరాను స్వరాష్ట్రంలో చూపించిన నాయకుడు కేసీఆర్ ని కొనియాడారు. ధాన్యం కొనుగోలు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. రైతుకు మంచి చేసే కెసిఆర్ ను ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతాడన్నారు. రైతులకు అన్ని వేళలా అండగా ఉండే పార్టీ టిఆర్ఎస్ ఒకటేనన్నాడు. పార్టీ అధిష్టానం ఎక్కడ నుండి పోటీ చెయమన్నా చేస్తానని, పోటీ మాత్రం తప్పదన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ మండలాల ఎంపీపీలు సున్నం లలిత, భానోత్ పార్వతి, గానుగుపాడు సొసైటీ చైర్మన్ చెవుల చందర్రావు, మువ్వ విజయ్ బాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, మాలోత్ బోజ్య నాయక్, సారేపల్లి శేఖర్, నరుకుళ్ళ సత్యనారాయణ, సర్పంచులు బానోత్ రన్య, పూసం వెంకటేశ్వర్లు, సత్తి నాగేశ్వరరావు, ఇస్లావత్ శంకర్, గూగులోత్ రాములు,గాదె లింగయ్య,పర్స వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: