CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలి కేంద్ర ప్రభుత్వంపై డిమాండ్.

Share it:


మన్యం టీవీ చర్ల:

ఈరోజు చర్ల మండల కేంద్రం చర్ల గ్రామపంచాయతీ పరిధిలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరలు తగ్గించాలని బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చెయ్యడం జరిగింది.చర్ల

గాంధీ సెంటర్ లో సీపీఎం శాఖ కార్యదర్శి మచ్చా.రామారావు అధ్యక్షతన జరిగిన ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి చర్ల సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కొండ చరణ్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి తీరును నిరసిస్తూ ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్న అటువంటి మతోన్మాద పార్టీ బిజెపి ని గద్దె దింపాలి అంటే మనందరం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఆయన కేంద్ర బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని విద్యుత్ చార్జీలు తగ్గించకుంటే పోతే గత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతి టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అదే గతి పడుతుందని వెంటనే తగ్గించాలని లేదంటే భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని హెచ్చరించారు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని లేదంటే దాన్యం కొనుగోలు చేయకుంటే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడతామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర టిఆర్ఎస్ ప్రభుత్వం మీద మీరే కొనాలని రాష్ట్ర టిఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర పాలించే బిజెపి ప్రభుత్వం కొనాలని చేతులు చూపిస్తూ రైతులకు ఇబ్బంది చేస్తున్నటువంటి తీవ్రంగా ఖండిస్తున్నానని లేదంటే కేంద్రం బిజెపి ప్రభుత్వాన్ని గాని రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి గానీ రైతులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరిక చేశారు అలాగే పెంచిన నిత్యావసర సరకుల ధరలను కూడా వెంటనే తగ్గించాలని రేట్లను కూడా వెంటనే తొలగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకులు శ్యామల వెంకట్, సతీష్, ప్రకాష్, మూర్తి సమ్మక్క, శారోని , శ్రీకాల తదితరులు పాల్గొన్న వారు.

Share it:

TS

Post A Comment: