CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముస్తఫా.... మతిభ్రమించి మాట్లాడొద్దు..

Share it:

 



▪️ కలిసి ఉన్న ముస్లింల ఐక్యతను దెబ్బ తీయోద్దు.


▪️అభివృద్ధితో సమాధానం చెప్పడం మంత్రి పువ్వాడ నైజం.


▪️ నీవ్యక్తిగత విషయంలోకి కులాన్ని లాగొద్దు..

మన్యం మనుగడ, ఖమ్మం:

గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ముస్తఫా అనే వ్యక్తి అభివృధ్ధి ప్రదాత అయిన పువ్వాడ అజయ్ కుమార్ గారి మీద మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీద 57వ డివిజన్ కార్పొరేటర్ రఫీదా బేగం భర్త ముస్తఫా మతిభ్రమించి వ్యాఖ్యలు చేస్తున్నారని ఖమ్మం నగర మైనార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు.


అసత్య ప్రచారాలు చేస్తున్న ముస్తఫా వ్యాఖ్యలను ఖండిస్తూ vdo's కాలనీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.


ముస్తఫా అనే వ్యక్తి రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో మూడు విషయాలను ప్రస్తావిస్తూ సోషల్ మీడియా, ఫేస్ బుక్ లో పోస్ట్ లు పెట్టడం జరిగిందని, ఆ పోస్ట్ కి సారాంశం ఏంటని, ముస్లిం సమాజానికి ఎం సందేశం పంపిస్తున్నవ్ ఆని ప్రశ్నించారు.


నీ వ్యక్తిగత అంశాలు, నీ వ్యాపార, రాజకీయ ప్రయోజనాల కోసం ముస్లిం ల మనోభావాలు, కులాన్ని వడుకుంటావా అని ద్వజమెత్తారు.


ఖమ్మం నగరంలో ఇప్పటి వరకు అన్ని కుల, మతాలు సహోదరులవలే కలిసి ఉన్నరని, దాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్న ప్రయోగాలు లాగా ఉన్నాయన్నారు.


నీ స్వార్థ ప్రయోజనాల కోసం ముస్లింల మధ్య ఆంతర్యం ఏర్పడేలా వ్యాఖ్యలు చేయడయం సిగ్గుచేటన్నారు.


మసీదులో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారిని ఆహ్వానించి వారిని సన్మానించడం ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నావు ఆని ప్రశ్నించారు.. వారిని ఆహ్వానించింది ఖమ్మం నగర అభివృధ్ధి ప్రదాతగా, ముస్లిం మాజిద్ ల అభివృధ్ధి కొసం రూ.50 లక్షలు మంజూరు చేయించిన ఘనత, పేద ముస్లింల సమస్యలు పరిష్కరించే నాయకుడుగా, తెలంగాణ రాష్ట్ర మంత్రి హోదాలో అహ్వానించి ప్రేమతో, గౌరవంగా శాలువాతో సత్కరిస్తే నీకు కలిగిన నొప్పి ఏంటో చెప్పాలని ముస్తఫాని ప్రశ్నించారు..


అలాంటి నిస్వార్థ నాయకుడు, మంత్రి పువ్వాడ మీద అవాకులు చవాకులు పేలడం సరికాదని హితవు పలికారు. 


నీ స్థానంఏంటో తెలుసుకుని ప్రవర్తిస్తే మంచిది ఆని ముస్తఫా కు సూచించారు. మన ముస్లిం సమాజం ఎంచబుతుందో తెలియదా..? ఎవరైనా మన మతంలోకి రావాలి అని తృష్ణగా ఉంటే ఆహ్వానించండి.. గౌరవించండి.. ఎందుకంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మతాలను గౌరవించాలి ఎందుకంటే నేను నా మతాన్ని ఆరాధిస్తాను అలానే ఇతరుల తమ తమ మతాలను గౌరవిస్తూ ఆరాధిస్తారు.. ఆని తెలియదా అన్నారు.


నిన్న మా టిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మా టిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు మరియు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరి కొంతమంది మీద అసత్య ఆరోపణలు చేయడం విచారకరమన్నారు.  


ఇకనైనా ఒళ్ళు దగ్గరపెట్టుకుని ఉండాలని, నిరాధారమైన ప్రచారాలు, వ్యాఖ్యలు చేస్తే ఈసారి ఊరుకునేది లేదని ఘటుగట్ హెచ్చరించారు.


సమావేశంలో నగర కార్యదర్శి మొహమ్మద్ ఇసాక్, 23వ డివిజన్ కార్పొరేటర్ మక్బుల్, సుడా డైరెక్టర్ ముక్తార్ షేక్, నగర ప్రచార కార్యథర్శి షేక్. షకీనా , షాదీఖానా డైరెక్టర్ మహ్మద్ సలీం, షాదీఖానా డైరెక్టర్ ముజాహిద్, నగర మైనారిటీ అధ్యక్షులు సంసుద్దీన్, 39వ డివిజన్ అధ్యక్షులు షేక్ జానీ మియా, నగర మైనారిటీ కోశాధికారి తాజుద్దీన్, 10వ డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ పాషా, నగర మైనారిటీ నాయకులు జహూర్, నగర మైనారిటీ నాయకులు షమ్ము, నగర మైనారిటీ నాయకులు అన్వర్ ఖాన్, నగర మైనార్టీ నాయకులు డాక్టర్ ఇసాక్, 44వ డివిజన్ అధ్యక్షులు షేక్ జానీ, నగర మైనారిటీ ఉపాధ్యక్షులు షేక్. ఉస్మాన్,2టౌన్ మైనారిటీ ఇన్ చార్జీ షేక్. అబ్బాస్ తదితరులు ఉన్నారు.

Share it:

TS

Post A Comment: