CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పినపాక మండలంలో పర్యటించిన రేగా.

Share it:


మన్యం మనుగడ, పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం లో తెలంగాణా ప్రభుత్వ విప్,కాక నియోజకవర్గ ఎమ్మెల్యే రేగా కాంతారావు వివిధ ప్రైవేటు కార్యక్రమాలలో పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరవరం గ్రామంలో అనిల్ కుమార్ - అశ్విని రిసెప్షన్ ల వేడుకలకు హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. అదేవిధంగా దుగినేపల్లి గ్రామంలో కందిమళ్ల నరసింహారావు వెడ్స్ కీర్తి ల రిసెప్షన్ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అమరారం గ్రామానికి చెందిన వజ్జా లక్ష్మీ అనారోగ్యంతో బాధపడుతుండటంతో విషయం తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి వారిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అమరారం పంచాయతీ ఎంపీటీసీ కాయం శేఖర్, సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు,టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: