CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల తనిఖీ చేసిన పి ఓ.

Share it:

 


మన్యం మనుగడ మణుగూరు:

పరీక్షలు దగ్గర పడుతున్నందున గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్నా విద్యార్థినీ , విద్యార్థులు గైర్హాజరు కాకుండా విద్యార్థుల హాజరు శాతం పెంచాలని అందుకు సంబంధిత ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని భద్రాచలం ఐ టి డి ఎ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రూ సంబంధిత ఉపాధ్యాయులకు సూచించారు.మంగళవారం నాడు మణుగూరు లోని బాలికల గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశా లను ఆయన ఆకస్మిక తనిఖీ చేసి పాఠశాల లోని వంటగది ,డార్మెటరీ మరియు పాఠశాల గదులను పరిశీలించారు. అంతకుముందు ఇంటర్మీడియట్ పి ఎం హెచ్ హాస్టల్లో పరిసరాలను గదులను పరిశీలించి ఆయన సంతృప్తి వ్యక్తం చేస్తూ హాస్టల్ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని అందుకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి తనకు సమర్పించాలని డిడి ట్రైబల్ వెల్ఫేర్ ,రమాదేవిని ఆదేశించారు. అలాగే బాలికల గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పదవ తరగతి సంబంధించిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని పరీక్షలు దగ్గర పడుతున్నందున వారికి ప్రత్యేక తరగతులు నిర్వహించి పరీక్షలంటే భయం లేకుండా చూసే బాధ్యత సంబంధిత ఉపాధ్యాయులపై ఉందని అందుకు పిల్లలందరికీ భయం పోగొట్టే టట్లు స్పెషల్ క్లాసులు తీసుకొని 100% ఉత్తీర్ణత సాధించేలా పిల్లలను సన్నద్ధం చేయాలని ఆయన అన్నారు.పదవ తరగతి పిల్లలకు అలాగే పాఠశాలలో చదువుతున్న పిల్లలకు ప్రత్యేక మెనూ ప్రకారము ఆహారం అందించాలని మెనూ విషయంలో అశ్రద్ధ చేయవద్దని ఆయన అన్నారు. పదవ తరగతి పిల్లలకు ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు తీసుకోవాలని అలాగే పాఠశాలలో డార్మెటరీ తో పాటు అదనపు సౌకర్యాలు కల్పిస్తామని అందుకు పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసిన బాధ్యత సంబంధిత హెచ్ఎం మరియు ఉపాధ్యాయులపై ఉందని ఆయన అన్నారు. పదవ తరగతి పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారికి తప్పకుండా అదనపు మెనూ తో పాటు వాళ్లకు సంబంధించిన స్టడీ మెటీరియల్ అందించాలని ఆయన అన్నారు.

   ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏ టి డి వో నరసింహారావు, పి ఎం హెచ్, హాస్టల్ వార్డెన్, పార్వతి ,హెచ్ఎం సారమ్మ హెచ్ డబ్ల్యూ ఓ, కుమారి, మణుగూరు ,తాహసిల్దార్ నాగరాజు ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: