CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అప్రమత్తతే అగ్ని ప్రమాదాల నివారణకు ఏకైక మార్గం --:పీకే ఓ సి డిప్యూటీ మేనేజర్ భూక్య భాంగ్యా.

Share it:

 


మన్యం మనుగడ, మణుగూరు:

            అగ్ని ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు మరియు అప్రమత్తతే ఏకైక నివారణ మార్గమని అగ్రి మాపక సాధనాల వినియోగంపై వాటి పనితీరు పై ప్రతి ఒక ఆపరేటర్ డ్రైవర్లు పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని అని పీకే ఓసి డిప్యూటీ మేనేజర్ శ్రీ భూక్య భాంగ్యా అన్నారు ప్రకాశం ఖని ఉపరితల గని రక్షణ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం కార్య నిర్వహణ కార్మికుల విభాగం (ఆపరేషన్స్) ఓసి - రిలే-B లో జరిగిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ SOP ప్రచార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు వేసవిలో అత్యధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో సాధారణంగానే యంత్రాలు వేడెక్కుతాయని మంట మండటానికి కావలసిన కాటన్ వేస్ట్ బొగ్గు పొడి ఆయిల్ లీకేజీ లేకుండా చూసుకోవాలని సింగరేణి యాజమాన్యం ఖర్చుకు వెనుకాడకుండా లక్షలు వెచ్చించి భారీ యంత్రాలకు ఆటోమేటిక్ ఫైర్ ఎక్సేంజర్స్ (అగ్ని మాపక సాధనాలు)ఏర్పాటు చేయడం జరిగిందని వాటి పనితీరు నిర్వహణపై ఆపరేటర్లు సరైన అవగాహన కలిగి ఉండటమే కాకుండా ఊహించని విధంగా పొగ కానీ మంట కానీ కనిపిస్తే ఆయా సందర్భాలలో తమని తాము రక్షించుకుంటూ ధైర్యంగా యంత్రాలను కూడా రక్షించాలని ఆయన కోరారు అలాగే ఎండాకాలం ప్రతి కార్మికుడు స్వీయ రక్షణ సూత్రాలు పాటించాలని నీరు సమృద్ధిగా తాగాలని అని ఆరోగ్య సూత్రాలు పాటించాలని అని కోరారు, ఆపరేటర్ నాగేల్లి రాజు ఎస్ ఓ పి కరపత్రం చదివి వినిపించారు, అనంతరం కార్మికులు సామూహిక రక్షణ ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ అండర్ మేనేజర్ సేత్ రామ్ , సూపర్వైజర్లు సతీష్, ముజాహిద్ , ఉమర్,ఎస్ ఓ పి సమన్వయకర్త sd నా సర్ పాషా, గుర్తింపు సంఘం నాయకులు పూనెం కాంతారావు, ఆపరేటర్లు ఎండీ గౌసుద్దిన్, k నరసింహ, ఎండీ నజీరుద్దీన్ బాబా,సున్నం నాగేశ్వరరావు,రాంబాబు, చెరుకు వెంకటేశ్వర్లు, కిషన్, k సత్యనారాయణ, ఆంజనేయులు,కురుప్, బత్తుల కృష్ణ, sk కరీముల్లా, రాఘవ, మబ్బు రాములు, అన్వర్ ,ట్రైనీ ఆపరేటర్లు, మానిటర్ జర్పుల రాము తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: