CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బూర్గంపాడు మండలం లో ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా విస్తృత పర్యటన.

Share it:

 


మన్యం టీవీ భూర్గంపాడు:.


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం తాళ్ల కొమ్మూరు గ్రామపంచాయతీ శ్రీ సత్యనారాయణ ఫంక్షన్ హాల్ నందు *భద్రాద్రి లోకల్ స్టార్ యాప్* ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు చేతుల మీదుగా ఆవిష్కరించారు.


అనంతరం సారపాక పట్టణం లోని సినిమా హాల్ రోడ్డు నందు టిఆర్ఎస్ పార్టీ నాయకులు బెజ్జంకి కనకా చారి నూతనంగా ఏర్పాటు చేసుకున్న టీ టైం షాప్ ను ప్రభుత్వ విప్ రేగా కాంతారావు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది.


బూర్గంపాడు మండలం కొయగూడెం గ్రామంలో బొడ్డు ప్రసాద్,భాగ్య లక్ష్మి దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇల్లును రిబ్బన్ కట్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు బుధవారం నాడు ప్రారంభించారు.అనంతరం వారిని శాలువాతో ఘనంగా సన్మానించి పూలమాలతో సత్కరించడం జరిగింది.


ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు,టీఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు,మహిళ కార్యకర్తలు,యువజన నాయకులు,అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: