CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరు లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు భారీ నిరసన ర్యాలీ.

Share it:

 



  • కేంద్ర ప్రభుత్వం దాన్యం కొనుగోలు చేయలని డిమాండ్ 

మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ఆధ్వర్యంలో,సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మణుగూరు పట్టణంలో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు శ్రీ రేగా కాంతారావు మాట్లాడుతూ,రైతుల నిరసన సెగలు ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వానికి తగలాలఅన్నారు. ధాన్యం కొనుగోలు చేసే వరకు సీఎం కేసీఆర్ సారధ్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. జిల్లాలోని రైతులు,టిఆర్ఎస్ నాయకుల ఇండ్లపై నల్ల జెండాలు ఎగరవేసి నిరసన తెలియజేయడం జరిగింది అని తెలిపారు.రాష్ట్రంలో సాగుకు 24 గంటల ఉచితంగా కరెంట్, ఎకరాకు 10 వేల రూపాయల చొప్పున రైతుబంధు,రైతు బీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలోనే తెలంగాణ అని స్పష్టం చేశారు.తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాడి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేయిస్తామమన్నారు.గ్యాస్ ధరలు పెరగడంతో కట్టెల పొయ్యితో వంటలు చేసుకుంటున్నారని,పెట్రోల్,డీజిల్,ధరలు పెంచడంతో వాహనాలు నడవలేని పరిస్థితి ఏర్పడిందని కేంద్ర ప్రభుత్వం పై విప్ రేగా ధ్వజ మెత్తారు. రైతులను రెచ్చగొడుతున్న బిజెపి నాయకులను నిలదీయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.రైతుల ఆందోళనలు చూసైనా కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.


కేంద్ర ప్రభుత్వానికి ముందుచూపు లేని కారణంగా దేశంలోని రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనిది రైతుల కోసం ఉద్యమ నాయకులు సీఎం కేసీఆర్ దీక్షకు దిగారు అన్నారు.ఈనెల 11వ తేదీన మంత్రులు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,కార్పొరేషన్ చైర్మన్లు లు, టిఆర్ఎస్ నాయకులతో పెద్ద ఎత్తున ఢిల్లీలో నిరసన తెలియజేస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో మణుగూరు మండలం, టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు, కార్యదర్శులు,యువజన నాయకులు,కార్యకర్తలు, అభిమానులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: