CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కపట నాటకాలు మాని వడ్లు కొనుగోలు చేయండి -ధర్నాల వల్ల రైతులకు ఒరిగిందేమీ లేదు. -కాంగ్రెస్ పార్టీ నాయకులు జేష్ట.

Share it:

 


మన్యం మనుగడ, అశ్వారావుపేట: రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం వడ్లు కొనుగోలు చేయడం లేదనే నెపంతో రాష్ట్రంలో ఆందోళనలు చేస్తూ కపట నాటకాలు ఆడుతుందని, వెంటనే కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణలో పండించిన ప్రతి గింజను కొని చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని జిల్లా కాంగ్రెస్ నాయకులు జేష్ఠ సత్యనారాయణ చౌదరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అశ్వారావుపేట లో జరిగిన కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా అధికార పార్టీ వాళ్లే ధర్నా చేస్తూ తెరాస పార్టీ ప్రజలను మోసం చేస్తుందని, ఓట్లేసి గెలిపించిన ప్రజలను ఆదుకోలేని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద సాకులు చెబుతూ వడ్లు కొనుగోలు విషయంలో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నదని వారు ఎద్దేవా చేశారు. రైతుబంధు పేరుతో 14 వేల కోట్లు వెచ్చిస్తున్న ప్రభుత్వం పేద చిన్న కారు రైతులు పండిస్తున్న వడ్లను రెండు, మూడు వేల కోట్లు వెచ్చించి కొనలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకు దాపురించిందని వారు విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఓట్లేసి కేసీఆర్ ను గెలిపిస్తే తాను మాత్రం నెపం మోడీ మీద వేస్తూ రైతాంగాన్ని ఇబ్బందులపాలు చేస్తుందని, తెలంగాణ రైతుల పై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వరి ధాన్యాన్ని కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ వరి ధాన్యం కేంద్రం కొనుగోలు చేయడం లేదనే పేరుతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మిల్లర్లకు, దళారులకు లాభం చేకూర్చే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని, ఒక క్వింటాలు ధాన్యం పంతొమ్మిది వందల పైచిలుకు రేటు ఉండగా గత్యంతరం లేని పరిస్థితుల్లో రైతు మిల్లర్లకు, దళారులకు వెయ్యి రూపాయలు, పన్నెండు వందల రూపాయలకు అమ్మాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఈ విధానం తెలంగాణ రైతాంగానికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చక పోగా మరింత ఆగాదం లోకి నెట్టే విధంగా ఉందని వారు దుయ్యబట్టారు. వేల కోట్ల రూపాయలు వెచ్చించి ధాన్యం నిల్వ చేసేందుకు కట్టిన గోదాములు తెలంగాణ రైతాంగానికి ఏ విధంగా ఉపయోగపడటం లేదని రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి ఆ గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చని కానీ అటువంటివి ఏమీ చేయకుండా దొంగే దొంగా దొంగా అన్న చందంగా పాలక పార్టీలే ధర్నాలు చేయడం మహా విడ్డూరంగా ఉందని వెంటనే తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పండించిన ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిచో రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దాసరి నాగేంద్ర రావు, ఆగిరిపల్లి రాంబాబు, షేక్ అన్వర్, మారిన రామారావు, అమర్ నాథ్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: