CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

బాల మేధావులకు పురస్కారాలు ఎమ్మెల్యే రేగా కాంతారావు చేతులమీదుగా అందజేత..

Share it:

 


మన్యం మనుగడ, పినపాక:

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి కార్యక్రమం తో ప్రభుత్వ పాఠశాలలకు మహార్థశ పట్టనుoదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాండురంగాపురం గ్రామంలోని మండల ప్రాథమిక ఉన్నత పాఠశాల నందు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, అవార్డ్స్ ప్రధానోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ప్రధానోత్సవం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.ప్రభుత్వ పాఠశాలలో అందిస్తున్న నాణ్యమైన విద్య మూలంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించడంతో పాటు ఉన్నత ఉద్యోగాలు సాధిస్తారని సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి వారిని తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో స్థానం పొంది విధంగా తర్ఫీదు ఇచ్చిన ఉపాధ్యాయురాలు చాంద్ బేగం ను కొనియాడారు. ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్న పూర్వ విద్యార్థులు తాము చదువుకున్న ప్రభుత్వ బడులకు విరివిరిగా విరాళాలు అందించి సర్కారీ బడుల అభ్యున్నతి కోసం తోడ్పడాలని విజ్ఞప్తి చేశారు.మన ఊరు మనబడి కార్యక్రమం సర్కారు బడుల్లో అన్ని మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యా బోధన మెరుగుపడుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో పినపాక మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, పార్టీ సీనియర్ నాయకులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: