CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రైతు పండించిన వరి ధాన్యం ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది.ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం: రైతు ఆరుకాలం కష్టపడి పండించిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు.ఆయన గురువారం వ్యవసాయ శాఖ, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి మండల పరిధిలోని సమత్ బట్టుపల్లి గ్రామ పంచాయతీలో గల కుర్నవల్లి గ్రామంలో పినపాక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఎప్సిఐ ద్వారా ధాన్యం కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యాన్ని గిట్టుబాటు ధర కల్పించకపోగా వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేమని చేతులెత్తేయడంతో రైతుల స్థితిగతులు తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ రైతులకు న్యాయం చేయాలనే ఆలోచనతో రైతుబంధు తోపాటు తెలంగాణ రాష్ట్రంలో పండించిన వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని రైతులకు హామీ ఇవ్వడం జరిగిందన్నారు. రైతుల పక్షాన నిలబడే ఏకైక వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. రైతుల తరుపున సీఎం కేసీఆర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్న అన్నారు.రాబోయే రోజుల్లో కేంద్ర బిజెపి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని రైతులే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. వ్యవసాయ శాఖ అధికారి.తాతారావు, ఎంపీపీ రేగా కాళిక, సొసైటీ చైర్మన్ రవి శేఖర్ వర్మ, ఆత్మ కమిటీ చైర్మన్ పటేల్ భద్రయ్య, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొమరం.రాంబాబు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య ప్రధాన కార్యదర్శి బుడగం.రాము ఉపాధ్యక్షులు పోగు. వెంకటేశ్వర్లు,నాయకులు రెడ్డి వెంకట్ రెడ్డి,సారా .సాంబయ్య శ్రీనివాస్ రెడ్డి, చిరంజీవి, రేగా సత్యనారాయణ, వాసిరెడ్డి నేతాజీ,చిట్టి.సతీష్ ,బర్లగూడెం సర్పంచ్ పోలెబోయిన నరసింహారావు,కరకగూడెం ఉపసర్పంచ్ రావుల.రవి,నిట్టా. ఏడుకొండలు,చిట్టిమల్ల.ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: