CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అజ్ఞాత సూర్యుడు, విప్లవ నేత,.న్యూడెమోక్రసీ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పైలా వాసుదేవ రావు ఆశయాల సాధనకు పోరాడుదాం.సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ.

Share it:




మన్యం మనుగడ, అశ్వాపురం:

శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాట సారధి, అమరుడు కామ్రేడ్ పైలా వాసుదేవరావు ఆశయాల సాధన కోసం అలుపులేని పోరాటాలు నిర్మించాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోరా రవి పిలుపునిచ్చారు. సోమవారం కామ్రేడ్ పైలా వాసుదేవరావు12 వ వర్ధంతి సభ అశ్వాపురం మండలం గొందిగూడెం గ్రామం లో బండ్ల వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మోరా రవి మాట్లాడుతూ.. భారత విప్లవ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన కామ్రేడ్ పైలా వాసుదేవరావు *ఏప్రిల్ 11, 2010 న* అమరుడయ్యాడని. అవిభక్త కమ్యూనిస్ట్ ఉద్యమకాలంలో టీచర్ ఉద్యోగం చేస్తూ, శ్రీకాకుళం లో గిరిజన ప్రజలకు నాయకత్వం వహించాడన్నారు. ఆ క్రమంలో టీచర్ వృత్తి ని వదులుకొని వృత్తి విప్లవకారుడుగా తన జీవితం ముగిసే వరకు విప్లవోద్యమంలో కొనసాగాడని. తన 58 సం,,ల పార్టీ జీవితంలో 48 సం,,లు పూర్తి కాలం కార్యకర్తగా పని చేసి. ఇందులో 42 సంవత్సరాలు అజ్ఞాత జీవితకాలంలో విప్లవ ఉద్యమానికి నాయకత్వం వహించాడని తెలిపారు. నక్సల్బరీ సాయుధ పోరాటం ప్రేరణతో 1968 లో ప్రారంభమైన శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటం లో తన జీవిత సహచరి చంద్రమ్మతో సహా అనునిత్యం మృత్యువుని ఎదుర్కొంటూ కొనసాగాడన్నారు. కామ్రేడ్ పైలా సహచరులు అనేకమంది బూటకపు ఎన్కౌంటర్లో అమరులయ్యారని, కామ్రేడ్ వెంకటపు సత్యo, ఆదిభట్ల కైలాసం, పంచాది కృష్ణమూర్తి,నిర్మల, తామాడ గణపతి, డా,, చాగంటి భాస్కర్ రావు,సుబ్బారావు పాణిగ్రహి, మొదలగు 400 మంది విప్లవ యోధులను వెంగళ్ రావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, దారుణంగా కాల్చి చంపిందన్నారు. ఉద్యమం వెనక పట్టు పట్టినప్పుడు. కామ్రేడ్ పైలా వాసుదేవరావు, శ్రీకాకుళ ఉద్యమ పునర్నిర్మాణంలో అనునిత్యం ఎనలేని కృషి సల్పాడని కొనియాడారు. 


సిపిఐ (ఎం-ఎల్) పార్టీలో కామ్రేడ్ పైలా సుదీర్ఘకాలం కేంద్ర కమిటీ సభ్యులుగా, రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగి. భారత విప్లవోద్యమంలో తన 78 వ సంవత్సరము లో రహస్యంగా కొనసాగుతున్న కాలంలోనే క్యాన్సర్ వ్యాధితో తుది శ్వాస వదిలాడన్నారు. కామ్రేడ్ పైలా వాసుదేవరావు నూతన ప్రజాస్వామిక విప్లవం కోసం, అకుంఠిత దీక్షతో సుదీర్ఘకాలం పోరాడారని, ఆయన ఆశయం సాధించేవరకు పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతుకూలి సంఘం అశ్వాపురం మండల కార్యదర్శి బండ్ల వెంకటేశ్వర్లు , ఎర్రయ్య, సూర్యం , రాము, ధర్మయ్య, భీమయ్య , మహాలక్ష్మి, సీతమ్మ, సునీత, తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: