CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏప్రిల్ 14న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగేకామ్రేడ్ జార్జిరెడ్డి 50వ వర్ధంతి సభను జయప్రదం చేయండి.

Share it:

 


  • పౌర హక్కుల సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి విప్లవ్ కుమార్.


  PDSU సంస్థాపకుడు, ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జిరెడ్డి 50వ వర్థంతి వర్ధంతి సభ ఏప్రిల్ 14న ఉస్మానియా యూనివర్సిటీ PDSU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుందని, ఈ సభను జయప్రదం చేయాలని పౌర హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి విప్లవ్ కుమార్ అన్నారు. ఈరోజు PDSU ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కోర్టు ఆవరణలో జార్జి రెడ్డి సంస్మరణ సభ కరపత్రాలను ఆవిష్కరించారు. 

    కామ్రేడ్ జార్జి రెడ్డి 1972లో ఉస్మానియా యూనివర్సిటీ లో ఉన్న అగ్రకుల పెత్తందారీ అరాచక శక్తులకు వ్యతిరేకంగా ఉస్మానియ యూనివర్సిటీలో పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల పక్షాన పోరాడారు. ఆనాడు క్యాంపస్ లో ఉన్న మతోన్మాద అరాచక శక్తులు అమ్మాయిలను కూడా హింసించేవారని, లైంగికంగా వేధించే వారిని ఈ అరాచక శక్తులకు వ్యతిరేకంగా విద్యార్థులను కూడాగట్టి పోరాటం చేసి అతి తక్కువ కాలంలోనే విద్యార్థులకు నాయకుడిగా ఎదిగాడు. కామ్రేడ్ జార్జ్ రెడ్డి న్యూక్లియర్ ఫిజిక్స్లో గోల్డ్మెడల్ లిస్ట్, కిక్ బాక్సింగ్ లో ఛాంపియన్. కామ్రేడ్ జార్జి రెడ్డి అశేషమైన పీడిత విద్యార్థులఆదరణ పొంది క్యాంపస్ లో జరుగుతున్న విద్యార్థి సంఘ ఎన్నికల్లో జార్జ్ అనుచరులు గెలుపొందారు. కామ్రేడ్ జార్జి రెడ్డి యూనివర్సిటీలో ఉంటే తమ అరాచకాలు సాగవని గ్రహించిన మతోన్మాదులు ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్నికల్లో ప్రచారం చేసి వస్తున్నా అర్జున్ రెడ్డి కత్తులతో నరికి ఏప్రిల్ 14 1972 న అతి కిరాతకంగా చంపారు. కామ్రేడ్ జార్జి రెడ్డి అందరికీ ఉచితమైన నాణ్యమైన విద్యను అందించాలని పోరాడారు. కుల మత దోపిడి అణచివేత లేని సమాజాన్ని సమ సమాజాన్ని కలలుకన్నాడు.  

నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జార్జిరెడ్డి ఆశయాలకు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. విద్యను మరింత కార్పొరేటీకరణ, కాషాయీకరణ చేస్తూ పేద విద్యార్థులకు విద్యకు దూరం చేస్తున్నాయి. విద్యారంగంలో అశాస్త్రీయమైన భావజాలం నింపుతూ మూఢనమ్మకాలు పెంపొందించే విధంగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చింది. కెసిఆర్ ప్రభుత్వం ప్రైవేటు యూనివర్సిటీలు తీసుకొచ్చి ఉన్నత విద్యా రంగాన్ని కార్పొరేటర్ కు తాకట్టు పెట్టింది. ఉద్యమ ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. లక్షా 90 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పిఆర్సి నివేదికలో బిశ్వాల్ కమిటీ నివేదిక ఇచ్చింది. కానీ 90 వేల ఉద్యోగాలు భర్తీ చేయడం నిరుద్యోగులను మరోసారి మోసం చేయడమే. ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని అని నూతన ఉద్యోగాలను కల్పించాలని అని, నిరుద్యోగ సమస్యతో చనిపోయిన విద్యార్థులకు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో PDSU ఖమ్మం జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు క్రాంతి మస్తాన్ నాయకులు 

ఉపేందర్ లక్ష్మీనారాయణ పౌరహక్కుల నాయకులు షరీఫ్ రవి ఖాదరl నాయకులు పాల్గొన్నారు...

ఇట్లు

విప్లవ అభినందనలు తో

పిడిఎస్యు ఖమ్మం జిల్లా కార్యదర్శి

జి మస్తాన్

Share it:

TS

Post A Comment: