CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రామాలయంలో బ్రహ్మోత్సవ పూజలు.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరు నాగారం

మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్బగా తతియ రోజు సోమవారం ఉదయం నిత్యారాధన,హోమము, బలిహరణము,తీర్థప్రసాద వినియోగం కార్యక్రమం జరిగిందని ఆలయ అర్చకులు యల్లాప్రగడ నాగేశ్వర్‌రావుశర్మ తెలిపారు.అలాగే సాయంత్రం నిత్యారాధన హోమము, బలిహరణము,సదస్యము, ఆరగింపు,తీర్థప్రసాద వినియోగం కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. అనంతరం రాత్రి 9 గంటలకు దొంగలదోపు కార్యక్రమాన్ని ఆలయ నిర్వాహకులు ఘనంగా నిర్వహించారని తెలిపారు. స్వామిరి వస్తువులను అపరించకపోయి దాచుకున్న వ్యక్తిని దొరకబట్టడమే ఈ దొంగలదోపు ప్రత్యేకథ అని అర్చకులు నాగేశ్వర్‌రావుశర్మ వివరించారు.కార్యక్రమంలో అర్చకులు మురళి మనోహర్‌శర్మ,హగ్రివచారి, ముక్కాముల వెంకటనారాయణశర్మ, రామ్మూర్తి శర్మ పాల్గొన్నారు. 

నేడు నాగబలి(పుష్పయాగం)

 నేడు ఉదయం నిత్యారాధన, పూర్ణాహుతి,ఆరగింపు తీర్థప్రసారద వినియోగం ఉంటుందని అర్చకులు నాగేశ్వర్‌రావుశర్మ తెలిపారు. అలాగే రాత్రి 9 గంటలకు నాగబలి(పుష్పయాగం) నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు.గ్రామంలోని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలన్నారు.కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ సప్పిడి రాము, కోశాధికారి అలువాల శ్రీనివాస్, డైరెక్టర్‌లు ఇర్సవడ్ల భిక్షపతి, బాలోజు బ్రహ్మం,చిత్తుబొత్తుల సదానందం,పర్వతాల లాలయ్య, కమిటీ సభ్యులు వీరాచారి, గడదాసు శివ, గడదాసు శశి,గొర్ల ప్రసాద్, సిద్దు, ఉదయ్, పర్వతాల లాలయ్య పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: