ఏప్రిల్ మాసం మహనీయుల జన్మదిన మాసం,ప్రతి మగాడి విజయం వెనుక మహిళ కృషి ఉంటుంది అంటూ సభల్లో గొప్పలు చెప్పే మగవారు ఆచరణలో హీనంగా అబలగా చూస్తూ తమ పురుష అహంకారంతో మాటలకే పరిమితమై సగభాగం ఉన్న మహిళలకు ఉత్సవ కమిటీలలో జిల్లా మొత్తంలో ఒక్కరికైనా చోటు ఇవ్వకపోవడం సిగ్గుచేటు.మహిళల హక్కుల కోసమే అంబెడ్కర్ గారు మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలుసుకోలేని వారు కమిటీలో ఉంటూ మహిళలకు చోటు ఇవ్వకపోవడం ఇంకా మహిళలు బానిసలే అనుకోవటం అజ్ఞానం.కనీసం ప్రభుత్వాలైనా మహిళల వాటా నిర్ణయించక పోవటం అర్ధరహితం.ఖమ్మం జిల్లా కలెక్టర్ కమిటీని పరిశీలించి విద్యావంతులైన మహిళలు ఎందరో ఉన్నారు కాబట్టి కనీస సంఖ్యలో నైనా అవకాశం కల్పించాలని మహిళలుకోరుచున్నారు.మహిళకు గుర్తింపు ఇవ్వకపోవడం గూర్చి ఒక్క అధికారి అయినా ఆలోచించకపోవటం విచిత్రంగా ఉంది అని మహిళలు మాధనపడుతున్నారు.ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ,డి.డి.,ఇతర సంబంధిత అధికార యంత్రాంగం ఆలోచించి జిల్లా మహిళలకు ఉత్సవ నిర్వహణ కమిటీలో చోటు కల్పించాలని కోరుతూ మహిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.పై వాస్తవాలను తెలుసుకొని జిల్లా ఉన్నతాధికారులు మహిళలకు స్థానం కల్పించాలని జాతీయ మాల మహానాడు జిల్లా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి బందెల.నాగలక్ష్మి ఒక ప్రకటన విడుదల చేశారు.
Navigation
Post A Comment: