CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కల్యాణానికి ముస్తాబైన రామాలయం.ఘనంగా పాలపొరక పచ్చని పందిరి వేడుకలు.

Share it:

 


మన్యం మనుగడ ఏటూరునాగారం

మండల కేంద్రంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం నేడు(ఆదివారం) జరగబోయే సీతారాముల కల్యాణానికి ముస్తాబు అయ్యింది.రామాలయం కమిటీ ఆధ్వర్యంలో తాటాకులతో పచ్చని పందిరి,మామిడి తోరాలు కట్టి ముస్తాబు చేశారు.ఈనెల 9వ తేదీ నుంచి ప్రత్యేక కార్యక్రమాలు మొదలై తేదీ 12వ తేదిన ముగుస్తాయి.9వ తేదీని ఎదురుకోళ్ల ఉత్సవం, 10వ తేదిన సీతాదేవి శ్రీరాముల కల్యాణం,11న రాత్రి 9 గంటలకు దొంగలదోపు,12 నాగబెల్లి,13వ తేదిన వసంతోత్సవంతో కల్యాణ కత్రువు ముగుస్తుంది. ఐదు రోజుల పాటు కన్నుల పండువగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్‌ సప్పిడి రాము తెలిపారు.భక్తులకు తాగునీటి వసతి,చలువ పందిళ్లు, క్యూలైన్లుతోపాటు వలంటీర్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. భక్తులు క్యూ పద్దతిలో దేవతలను దర్శించుకున్న భక్తులకు తీర్థప్రసాదాల వినియోగం జరుగుతుందన్నారు.కల్యాణం జరిగే క్రమంలో పులిహోర పంపిణీ కార్యక్రమం, వడపప్పు,బెల్లం పానకం వంటివి భక్తులకు అందిస్తున్నట్లు తెలిపారు. భక్తులు దంపతులుగా హాజరు కావాలని కోరారు.అలాగే ఆలయంలో ఐదు రోజుల పాటు ప్రత్యేక హోమం ఉదయం 7 గంటలకు,రాత్రి మళ్లి 7 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు యల్లప్రగఢ నాగేశ్వర్‌రావు శర్మ తెలిపారు. హోమంలో దంపతులుగా హాజరై హోమ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.

*ఘనంగా పాలపొరక పచ్చని పందిరి వేడుకలు*

మండలంలోని అటవీ ప్రాంతం నుంచి జిన్న చెట్టు ఆకు కొమ్మలు,పాల ఆకుల కొమ్మలను ఎడ్లబండ్లలో గ్రామ పురవీధుల్లో నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా భక్తులు, ఆలయ నిర్వాహకులు,మహిళలు తీసుకువచ్చి కల్యాణ మండపంపై అలంకరించారు. పాలాకులను కొమ్మలను తీసుకురావడం కల్యాణం ముందు రోజు ఆనవాయితీ. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని చప్పుళ్లు,మంగళ హారతులతో ఆలయానికి పాలపొరకు చేర్చారు. దీంతో కల్యాణ వేడుకలు ప్రారంభం అయ్యాయి.కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ సప్పిడి రాము, ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, కోశాధికారి అలువాల శ్రీనివాస్,5వ వార్డు సభ్యురాలు కనకతార,పోగుల లక్ష్మినారాయణ,కమిటీ సభ్యులు సిసింద్రి,బాలు, తాళ్లపెల్లి నర్సింహులు,గడ్డం మహేష్,గడ్డం సతీష్,ఇర్సవడ్ల భిక్షపతి,చిత్తుబొత్తుల సదానందం,గడదాసు శివ, జాడి కష్ణ,జనగాం రాజు, బలబధ్ర రవి,బ్రహ్మ,ఉదయ్, సిద్దు,గొర్ల ప్రసాద్‌ పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: