CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జూలూరుపాడు మండల కేంద్రంలో 5.22 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్..

Share it:

 


మన్యం మనుగడ : జూలూరుపాడు, ఏప్రిల్ 4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండల కేంద్రంలోనీ జాతీయ రహదారికి ఇరువైపులా సైడ్ డ్రైనేజ్, సెంట్రల్ లైటింగ్, డివైడర్ గ్రిల్స్ ఏర్పాటు కొరకు డిఎంఎఫ్టి నిధుల నుండి మంజూరు అయిన 5.22 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను జూలూరుపాడు నుండి చీపురుగూడెం వరకు రహదారి ఏర్పాటుకు సోమవారం తెలంగాణ రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ విప్ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాత మధుసూదన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే రాములు నాయక్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ.. జూలూరుపాడు మండలం మారుమూల వెనుకబడిన మండలం, ఇంతవరకు ఎవరూ చేయని విధంగా అభివృద్ధి పనులు ఎమ్మెల్యే రాములు నాయక్ హయాంలో జరుగుతున్నాయని అన్నారు, వైరా నియోజకవర్గ అభివృద్ధికి తాను ఎల్లవేళలా ఎమ్మెల్యే రాములు నాయక్ కి తోడు ఉంటానని హామీ ఇచ్చారు. జూలూరుపాడు మండలం అభివృద్ధి పరచడంలో ఎమ్మెల్యే రాములు నాయక్ కి మీ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావుడ్యా సోనీ, జెడ్పిటిసి భూక్య కళావతి, మండల రైతు బంధు సమితి కన్వీనర్ యదళ్ళపల్లి వీరభద్రం, మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చౌడం నరసింహారావు, మండల ఎంపీటీసీలు, సర్పంచులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: