CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కోటి ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత కేసీఆర్ దే.రైతుకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్సే.

Share it:


  • అన్నదాతలపై వివక్ష చూపుతున్న కేంద్రానికి పతనం తప్పదు. 
  • ములుగు మండల రైతు నిరసన దీక్షలో మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్. 

మన్యం మనుగడ ములుగు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోటి ఎకరాలను సాగులోకి తెచ్చి రైతన్నలకు అండగా నిలిచిన ఘనత మన టీఆర్ఎస్ ప్రభుత్వానికి,సీఎం కేసీఆర్ కే దక్కుతుందని ములుగు మండలం అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రైతు నిరసన దీక్ష తెరాస ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు ములుగు నియోజకవర్గ ఇన్చార్జ్ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ ఆదేశాను సారం నిర్వహించారు.ములుగు మండలంలో తెరాస పార్టీ మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన రైతు నిరసన దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.అధికారం కోసమో..పదవులకోసమో అన్నదాతల సంక్షేమాన్ని విస్మరిస్తే రాబోవు రోజుల్లో పతనం తప్పదని హెచ్చరిం చారు.ఎన్నికల సమయంలో రైతన్నల చుట్టూ తిరిగి వారి అండదండలతో అందలం ఎక్కాక వారి బాగోగులు పట్టించ కోకపోవడం దారుణమైన విషయమన్నారు. తమకు అనుకూలంగా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లోని రైతులకు ఓ న్యాయం... అనుకూలంగా లేని రాష్ట్రాల్లో ఓ న్యాయం చేయడం సిగ్గుచేటన్నారు.ఇదే ద్వంద్వ నీతిని పాటిస్తే తెలంగాణ రైతులతో పాటు ప్రజానీక ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ములుగు జడ్పిటిసి సకినాల భవాని, ములుగు ఎంపిపి గండ్రకోట శ్రీదేవి సుధీర్ యాదవ్,రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య,రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కేశెట్టి కుటుంబరావు,ములుగు నియోజకవర్గ యూత్ కోఆర్డినేటర్ కోగిల మహేష్, ములుగు టౌన్ అధ్యక్షుడు చిన్న విజయ్,మండల యూత్ అధ్యక్షుడు బైకని సాగర్,మాజీ సర్పంచ్ పిండి రవి యాదవ్, ఎంపీటీసీలు గొర్రె సమ్మయ్య, కుమార్ రమేష్ రెడ్డి,ఊర విష్ణువర్ధన్ రెడ్డి మండల సర్పంచులు మండల గ్రామ అధ్యక్షులు సుమారు 200 మంది రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: