CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అడవుల సంరక్షణ అందరి బాధ్యత.ఏడూళ్ల బయ్యారం రేంజర్ అధికారి తేజస్వి.ఘనంగా ప్రపంచ అటవీ దినోత్సవం వేడుకలు.

Share it:


మన్యం మనుగడ కరకగూడెం:అడవుల సంరక్షణ అందరి బాధ్యతని ఏడూళ్ల బయ్యారం రేంజ్ అధికారి తేజస్వి అన్నారు.ఈ మేరకు ఆమె సోమవారం ప్రపంచ అటవీ దినోత్సవంను పురస్కరించుకుని మండల కేంద్రంలో అడవుల ఆవశ్యకత తెలుపుతూ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ తరాల కోసం మొక్కలు నాటడం మంచి అలవాటని, ప్రతిఒక్కరూ దీన్ని అలవరుచుకోవాలని కోరారు. గ్లోబల్ వార్మింగ్, పర్యావరణ మార్పులను ఎదుర్కోవడానికి విరివిగా మొక్కలు నాటడమే ఉత్తమ మార్గమని తెలిపారు.అడవుల పరిరక్షణ ఆవశ్యకత అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతో, ప్రజల్లో చైతన్యం రావాలని మార్చి 21ని ప్రపంచ అటవీ దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని తొలిసారిగా 2014న దేశవ్యాప్తంగా అటవీ దినోత్సవం పాటించారు. మానవుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధికి అడవులు ఎంతో అవసరమని తెలుపడమే ప్రపంచ అటవీ దినోత్సవ ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో అటవీశాఖ సెక్షన్,బీట్ ఆఫీసర్లు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: