CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఉపాధిహామీ నిధుల కేటాయింపులో అవకతవకలు.

Share it:

 


మన్యం మనుగడ ప్రతినిధి దమ్మపేట మార్చి ( 23 ) బుధవారం ;- దమ్మపేట మండలంలో 31 గ్రామ పంచాయతీలు ఉండగా ఇటీవల జాతీయ ఉపాధి హామీ పథకంలో మండలానికి నాలుగు కోట్ల రూపాయలకు పాలన అనుమతులు లభించాయి. 58444 జనాభా కలిగిన దమ్మపేట మండలం లో లో 728 మంది జనాభా ఉన్న గ్రామానికి 50.55 లక్షల రూపాయలు మంజూరు చేసి ఇదే మండలంలో 15 శాతం జనాభా కలిగిన ఏడు గ్రామ పంచాయతీలు మారప్పగూడెం, పూసుకుంట, శ్రీరాంపురం, వడ్లగూడెం, గణేష్ పాడు, మొండివర్రే, జగ్గారం గ్రామాలకు అసలు నిధులు కేటాయించకపోవడండం పై ఆయా గ్రామస్తులు ఆగ్రహోదగ్ధులు అవుతున్నారు. మందలపల్లి ఉప సర్పంచ్ గారపాటి సూర్యనారాయణ మాట్లాడుతూ కేవలం ఒక శాతం జనాభా కలిగిన గ్రామానికి 50 లక్షలు (12.5 శాతం నిధులు) కేటాయించి 15 శాతం జనాభా కలిగిన 7 గ్రామ పంచాయతీలకు అసలు నిధులు కేటాయించకపోవడం మరియు మండల జనాభాలో 10 శాతం జనాభా కలిగిన మందలపల్లి గ్రామానికి కేవలం రెండు శాతం నిధులు కేటాయించటం దారుణం అని పేర్కొన్నారు. ఈ విషయమై మండల అధికారులు మరియు ఉపాధిహామీ అధికారులను సంప్రదించగా అట్టి కేటాయింపులలో తమ ప్రమేయం లేదు అని సమాధానం చెప్పినారు అని మండల స్థాయిలో ఏ విధమైన సమావేశాలు నిర్వహించకుండా, క్షేత్రస్థాయిలో పరిశీలన లేకుండా ఈ కేటాయింపులు ఏ ప్రాతిపదికన చేశారో విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని, పరిపాలనలో పారదర్శకత లోపించినందున వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టి అన్ని గ్రామ పంచాయతీలకు తగిన న్యాయం చేయవలసిందిగా పంచాయతీరాజ్ కమిషనర్ కు, జిల్లా కలెక్టర్ కు, డి ఆర్ డి ఓ మరియు జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీర్ కు విడివిడిగా లేఖలు రాసినట్లు గారపాటి సూరి తెలిపారు.

Share it:

TS

Post A Comment: