CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు సాగు దారులు సమస్యను వెంటనే ప్రభుత్వం పరిష్కారం చేయాలి.ప్రగళ్ల పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ నిధులు ఎక్కడ.మాజీ ఎంపీ డాక్టర్ మీడియం బాబురావు డిమాండ్.. ...

Share it:

 


మన్యం టివి దుమ్ముగూడెం::

దుమ్ముగూడెం మండలం ములకపాడు సెంటర్ లో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మారాయిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ తిరుపతి రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాజీ ఎంపీ డాక్టర్ మిడియం బాబూరావు మాట్లాడుతూ, ఆదివాసీలు సాగు చేసినప్పుడు భూములు పై దాడులు ఆపాలని ప్రభుత్వం ఆదివాసుల పైన సవతితల్లి ప్రేమను సిద్ధిస్తుందని లేదంటే గత అక్టోబర్ నెల 5న జరిగిన సడక్ బంద్ కార్యక్రమం లాంటి మరో ఉద్యమాలు చేయవలసి వస్తుందని ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి ఆదివాసీ గిరిజనుల పైన దాడులు ఆపకపోతే మరో ఉద్యమం తప్పదని టిఆర్ఎస్ ప్రభుత్వం పైన హెచ్చరిక చేశారు. ఎండాకాలంలో ఆదివాసి గ్రామాలలో మంచినీళ్లు సౌకర్యం లేక అనేక గ్రామాలలో ఇబ్బంది పడుతున్నారని మిషన్ భగీరథ పైప్ లైన్ లో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పైప్లైన్ ద్వారా నీళ్లు అందించే విధంగా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు కృషి చేయాలని లేదంటే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ప్రగళ్ల పల్లి లిఫ్ట్ ఇరిగేషన్ నిధులు ఎక్కడ అని జాడ లేదని గత సంవత్సరం ప్రభుత్వం చెప్పినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చెప్పిన మాటలకి విలువ లేదా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని వెంటనే నిధులు కేటాయించి ప్రగళ్లపల్లి నుండి కొత్తపల్లి వరకు నిధులు కేటాయించి నీరు అందించాలని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి సరియం కోటేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కారం పుల్లయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు మర్మం చంద్రయ్య, సిఐటియు మండల కన్వీనర్ చిలకమ్మా, సీతారామయ్య రైతు సంఘం నాయకులు కూరం వీరభద్రం, సర్పంచ్ సోయం పార్వతి, వర్ష చిన్నారావు ,కొమరం వీరాజ్ ,కొరస శ్రీను ,సరియం వెంకటేష్ ,శీలం రమేష్, కాక బుచ్చిరాజు, అపక రంగయ్య, సున్నం వెంకటేశ్వర్లు ,పెనుబల్లి ప్రసాదు, శీలం మడకం పుల్లయ్య, ఇంకా తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: