CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

గిరిజనులు సాగుచేస్తున్న పోడు భూములు జోలికి వస్తే ఊరుకోం,వారికి పట్టాలు ఇవ్వాలి..

Share it:

 మన్యం టివి దుమ్ముగూడెం::

రామారావు పేట గ్రామంలో పోడు సాగు దారుల గ్రామ జనరల్ బాడీ సమావేశం స్థానిక సర్పంచ్ సోయం పార్వతి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆదివాసీ సాగు చేసుకుంటున్న పోడు భూముల జోలికి వస్తే ఊరుకోమని సిపిఎం పార్టీ నీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు, మండల కార్యదర్శి కారం పుల్లయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలు తరతరాలుగా సాగుచేస్తున్న పోడు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని అలాగే ప్రభుత్వం వెంటనే సర్వే చేసి హక్కు పత్రాలు ఇచ్చే విధంగా అసెంబ్లీ సమావేశంలో చర్చ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోడు భూములు సాగుచేస్తున్న ఆదివాసీలు అందరు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తెలంగాణ గవర్నమెంట్ ఆదివాసీలను మోసం చేస్తుందని గత 2021 నవంబరు 8 నుండి మొదలుకొని డిసెంబర్ 8 వరకు సర్వే చేసి ప్రతి సాగుదారులకు హక్కు పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చి ఇంతవరకు హామీని తుంగలో తొక్కి మళ్ళి ఫారెస్ట్ అధికారులు లాక్కునే విధముగా ప్రయత్నం చేయిస్తుందని ఇదే గనుక జరిగితే టిఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు ఉండవని హెచ్చరిక చేశారు . అదేవిధంగా ప్రతి గ్రామంలో ఎఫ్ ఆర్ సి గ్రామ కమిటీలు జరిగే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని ఆ బాధ్యత ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకోవాలని గ్రామ సభ జరగకుండా ఫారెస్ట్ అధికారులు పోడు జోలికి వెళ్లకూడదని వారు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఎం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు మర్మం చంద్రయ్య, పార్టీ మండల కమిటీ సభ్యులు సోడి రాంబాబు, ఎఫ్ ఆర్ సి కమిటీ చైర్మన్ సోడి శ్రీనివాస రావు, మాజీ సర్పంచ్ వర్సా చిన్న రావు, సోడి వీరస్వామి, కారం సీతారామయ్య, సోడి బోజ్జి, తోకల గోపాలరావు, కోమరం సీతారామయ్య, కారం సర్వేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: