CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏజెన్సీ ప్రాంతంలో ఇసుక మాఫియా ..

Share it:

 



  • రేజింగ్ కాంట్రాక్టర్ల విధానాన్ని పూర్తిగా రద్దు.
  • ప్రభుత్వ నిబంధనలకు చిల్లు
  • ఓకే వే బిల్లులో పదుల సంఖ్యలో లారీలు.
  • లారీలలో ఇసుక పరిమితికి మించి.
  • భారీ యంత్రాలతో తవ్వకాలు.

మన్యం మనుగడ వాజేడు.


ప్రభుత్వ ఇసుక రీచ్‌ల వద్ద రోజుకు లక్షల రూపాయల ఇసుక అక్రమంగా తరలి వెళ్తున్నా పట్టించుకున్న నాథుడే లేడు. అక్రమ రవాణాను నిరోధించాల్సిన సంబంధిత అధికారులు నిద్రావస్థలో ఉంటున్నారనే ప్రజల వాదనను కొట్టివేయలేని పరిస్థితి. ఇసుక లారీలు సామర్థ్యానికి మించి వెళ్తున్నా.. పట్టించుకునే నాధుడు లేడు. తనఖీలు చేయాల్సిన మైనింగ్, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు నామమాత్రం తనిఖీల తోనే సరిపెడుతున్నారు. సొసైటీ క్వారీల నుంచి అక్రమ రవాణాకు ఆజ్యం పోస్తోంది. ఇదిలా ఉండగా ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించిన అధికారుల నిత్య పర్యవేక్షణలో ఇసుక క్వారీ కొనసాగాల్సి ఉండగా ప్రస్తుతం సంబంధిత ప్రాజెక్టు అధికారి కొసమెరుపుగా దాడులు నిర్వహిస్తున్నా..రేసింగ్ కాంట్రాక్టర్లు మాత్రం అడ్డులేకుండా పోయింది.



ఇసుకలారీలకు పాసింగ్‌ పరిమితి ఇది..



ఇసుకను తరలించే వాహనాలకు ప్రభుత్వ రవాణా శాఖ నిర్ణీత బరువును నిర్ణయించింది. అందులో ఆరుచక్రాల వాహనంలో 7 క్యూబిక్‌మీటర్లు (10.50 మెట్రిక్‌టన్నులు), 10 చక్రాల వాహనంలో 10.50 క్యూబిక్‌మీటర్లు (17 మెట్రిక్‌టన్నులు), 12 చక్రాల వాహనంలో 13.50 క్యూబిక్‌మీటర్లు (22 మెట్రిక్‌ టన్నులు), 14 చక్రాల వాహనంలో 17 క్యూబిక్‌మీటర్లు (27 మెట్రిక్‌టన్నులు) ఇసుకను తరలించేందుకు అనుమతి ఉంటుంది. కానీ14 చక్రాల వాహనంలో 30 మెట్రిక్‌టన్నుల ఇసుక లోడుతో, రెట్టింపు బరువుతో కూడిన ఇసుకను తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని మండలంలో ఆరోపణలు వెల్లువెతున్నాయి.



ధ్వంసమైన రోడ్లు.. పెరుగుతున్న ప్రమాదాలు




సామర్థ్యానికి మించి రెట్టింపు బరువుతో ఇసుకలారీలు ప్రయాణించడంతో మండలంలోని ఏడుజలపల్లి గ్రామపంచాయతీ బొమ్మనపల్లి సొసైటీ ఇసుక రీచ్ లో పూసుర్ గ్రామంలో రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఇసుకలారీలు ఎదురు వచ్చినప్పుడు ఇతర వాహనాలు రోడ్డు దిగేక్రమంలో ప్రమాదాలబారిన పడుతున్నాయి. రోడ్డు పూర్తిగా ధ్వంసమై వాహనాల రాకపోకలకు వీలులేకుండా మారింది.


రేజింగ్ కాంట్రాక్టర్ల విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి.


ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన సొసైటీ ఇసుక రీచ్ లను,ఆదివాసీలను అభివృద్ధి చేయడం ఎంతైనా అవసరం, ఇసుక రీచ్ లను, ఆదివాసీలను ఆసరాగా చేసుకుని గుత్తేదారులు నిబంధనలను తుంగలో తొక్కి ఇసుక దందాను యదేచ్ఛగా నడిపిస్తున్నారు. క్వారీలలో రేజింగ్ కాంట్రాక్టర్ల ఆధిపత్యాన్ని పూర్తిగా రద్దు పర్చాలని ఆదివాసి సంఘం ఆధ్వర్యంలో తహసిల్దార్ కు, వినతి పత్రం అందజేశారు.



వేబిల్‌ లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు..



ప్రభుత్వ ఇసుక క్వారీవద్ద నుంచి వేబిల్‌ లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తీసుకుంటాం.ఇసుకను తరలించే వాహనదారులు ఆన్‌లైన్‌లో చలానాలు చెల్లించి వేబిల్‌ ప్రకారం నిర్ణీత సమయంలో మాత్రమే ఇసుకను తరలించాలి. వేబిల్‌ లేకున్నా, సమయం దాటినా లేక ఓవర్‌లోడ్‌తో వెళ్లినా సంబంధిత లారీలను పట్టుకుని సీజ్‌చేస్తాం. – అల్లం రాజ్ కుమార్ తహసీల్దార్, వాజేడు:

Share it:

TS

Post A Comment: