CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కదలకుండా కూర్చుంటే కల కూడా చెదిరిపోతుంది.ఆచరణకు పూనుకుంటే స్వప్నమైన సాకారమవుతుంది.--:గుంటపూడి తిరుమల.

Share it:

 



మన్యం మనుగడ, మంగపేట.

చదువు సమాజం లోని అసమానతలు సమూలంగా తొలగించి బహుజన జీవితాలను అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని బి.ఎస్.పి పార్టీ అసెంబ్లీ మహిళా కన్వీనర్ అబ్బ కళావతి అన్నారు.ఆదివారం బి.ఎస్.పి మండల శాఖ మండల నాయకురాలు గుంటపూడి తిరుమలక్క ఆధ్వర్యంలో మంగపేట మండలం రాజుపేట గ్రామం లోని బి ఎస్ పి పార్టీ కార్యాలయం లో స్థానిక స్కూల్ పిల్లలకు ఫ్యాడ్,స్టడీ మెటీరియల్ ను పంపిణీ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ..

కదలకుండా కూర్చుంటే కల కూడా చెదిరిపోతుంది ఆచరణకు పూనుకుంటేనే కదా స్వప్నమైన సాకారమవుతుంది.కలలు కనండి వాటిని సాకారం చేసుకోండి. శ్రీ శ్రీ చెప్పినట్లు చిరిగిన చొక్కా అయినా తోడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పాడు. వందల సంవత్సరాలనుండి మన జీవితాలు చీకటిలోనే ఉండి ఎన్నో బాధలు అవమానాలు సహించాము దాని అన్నింటికి కారణం విద్య లేక పోవటమే అటువంటి చదువు లు అభ్యసించి మీరు ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని, బహుజన సమాజానికి బహుజన ముందు తరాలకు బహుజన అభివృద్ధికి చదువే మార్గం చదివే లక్ష్యం గా బహుజన జీవితాలు అభివృద్ధి పథంలో నడపాలని బహుజన్ సమాజ్ పార్టీ నిరుపేద విద్యార్థులకు, వారి చదువుల్లో సంబంధిత మెటీరియల్స్అందించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని, బి.ఎస్.పి పార్టీ చదువుకే ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తామని చదువు ద్వారానే అజ్ఞానం తొలగి చైతన్యం వచ్చి అభివృద్ధివైపు అధికారం వైపు బహుజన సమాజం నడిపించడానికి ఉపయోగ పడుతుందని వారు పేర్కొన్నారు.

Share it:

TS

Post A Comment: