CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కార్మికవర్గ అంతర్జాతీయత స్ఫూర్తితో మార్చి 23 నుండి 29 తేదీ వరకు సామ్రాజ్యవాద వ్యతిరేక వారంగా పాటిద్దాం!.

Share it:

 


  • భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జె.ఎం. డబ్ల్యు.పి. డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేర లేఖ విడుదల


మన్యం మనుగడ,ఎటూరి నాగరం ప్రతినిధి:కార్మికవర్గ అంతర్జాతీయత స్ఫూర్తితో మార్చి 23 నుండి 29 తేదీ వరకు సామ్రాజ్యవాద వ్యతిరేక వారంగా పాటిద్దాం అని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) జె.ఎం. డబ్ల్యు.పి. డివిజన్ కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేర మావోయిస్టు లేఖ విడుదల చేసింది.లేఖ సారాంశం ఈ విధంగా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు పెల్లులుకుతున్న నేపథ్యంలో, భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్యవాదుల ఉరితీశతో కామ్రేడ్స్ భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్గురు అమరత్వం చెందిన 90 వార్షిక దినమైన ఈ సంవత్సరం మార్చి 22వ తేదీన సామ్రాజ్యవాద వ్యతిరేక దినాన్ని జరుపుకోబోతున్నాం. ఈ ఆమరత్వం సామ్రాజ్యవాద వ్యతిరేక చైతన్యానికి ఒక ప్రతీక. రష్యన్ సామ్రాజ్యవాదం ఉక్రెయిన్ ఫై దురాక్రమణ యుద్ధం చేసింది. ఈ యుద్ధం అమెరికా ఈయూ, రష్యా మధ్య మునుపటి సోవియట్ యూనియన్ రిపబ్లిక్స్లో సామ్రాజ్యవాద పోటీ ఫలితం, సామ్రాజ్యవాద వ్యతిరేక స్ఫూర్తితో ఉక్రెయిన్ ప్రజలు గట్టిగా ప్రతిఘటిస్తున్నారు. బ్రిటీషు సామ్రాజ్యవాదుల సంకెళ్ల నుండి భారతదేశాన్ని విముక్తి గావించడానికి దేశవ్యాప్తంగా పీడిత ప్రజలను పోరాటాల్లోకి కదిలించాలి. ఆ పోరాటానికి నాయకత్వం వహించిన కామ్రేడ్స్ భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురులను చూసి భయకంపితులైన బ్రిటీషు సామ్రాజ్యవాదులు ఆ ముగ్గురిని ఉరి తీసారు. కాని వారు చేసిన త్యాగం పోరాట స్ఫూర్తితో భారతదేశ పీడిత ప్రజలు, జాతులు రెట్టించిన స్పూర్తితో పోరాడినారు. ఆ పోరాటానికి భయపడిన బ్రిటీషు సామ్రాజ్యవాదులు ఇక్కడ ఉన్న మాస్వాములకు దళారీ బూర్జువాలకు అధికార మార్పిడి చేసి దొడ్డిదారిన వెళ్లిపోయారు.


దేశంలో బ్రిటీషు వలసవాదం ముగిసి భారతదేశం 1947లో బూటకపు స్వాతంత్రం పొందిన తర్వాత వెనుకబడిన దేశాలలో మాదిరిగానే


సామ్రాజ్యవాద దేశంలో కూడ నయావజన దోపిడీని అమలు చేసింది. 1991 నాటి ఎల్పీజీ సంస్కరణలు, సామ్రాజ్యవాద చొరబాటును మరింత వేగంగా పెంచాయి. 2008లో చెలరేగిన సామ్రాజ్యవాద ద్రవ్య ఆర్థిక సంక్షోభం యావత్ ప్రపంచాన్ని కుదినేవేయడంతో సామ్రాజ్యవాదులు ఈ సంక్షోభం నుండి బయటపడడానికి పెట్టుబడిదారీ దేశాల్లో, వెనుకబడిన దేశాల్లో కార్మికవర్గం, మధ్యతరగతి వర్గంపై భారం మోపింది. మన దేశంలో సామ్రాజ్యవాద దోపిడీకి అనుకూలంగా కనిపించిన బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టులైన భాజపాను అధికారంలోకి తీసుకునిరావడం అవసరంగా సామ్రాజ్యవాదం భావించి తీసుకువచ్చింది. అందులో సామ్రాజ్యవాద విధానాలను తూ.చ. తప్పకుండా అమలుచేయడానికి నరహంతక నరేంద్రమోడీని ముందు పెట్టి డిమానిటైజేషన్, జీఎస్టీ, వ్యవసాయ వ్యతిరేక చట్టాలు, కార్మికవ్యతిరేక చట్టాలు, ఎంఓయూలు, కశ్మీర్ 370, 35ఎ చట్టాల రద్దు, సీఎఏ లాంటి క్రూరచట్టులు అసులు, బీమా, బ్యాంకింగ్, రైల్వేలతో పాటు అనేక రంగాలను ప్రైవేదీకరించడం


మేకిన్ ఇండియా, స్టాంప్ లాంటివన్నీ అమలు.


చేస్తున్నారు. వీటికి వ్యతిరేకంగా పోరాడుతున్న పీడిత ప్రజలను, జాతులను, కార్మిక, కర్షకులను, ప్రజాస్వామిక పోరాటాలను, కార్మికవర్గ పోరాటాలను


అణచడంకోసం సమాధాన్-ప్రహార్ పేరుతో దాడులు ద్వారా విప్లవోద్యమాన్ని అణచివేస్తూ దేశాన్ని మన ప్రాతిపదిక మీద చీల్చి, హిందూ రాష్ట్ర స్థాపనకు పునాదులు వేసి, ఫాసిస్టు చర్యలకు పూనుకుంటుంది. సామ్రాజ్యవాదులు అనుసరిస్తున్న ప్రకృతి విధ్వంసం వలన వారి యుద్ధనీతిలో భాగంగా కరోనా లాంటి మహమ్మారులను సృష్టిస్తున్నారు. ఈ వ్యాధిని నయంచేయడానికి ! ప్రజలకు, ప్రభుత్వం సరైన వైద్యం అందించడం లేదు. మధ్యతరగతి ప్రజలు లక్షలాది రూపాయలు ఖర్చుచేసినా బ్రతుక్కు గ్యారంటీ లేదు. ఈ సంక్షోభం నుండి బయటపడడానికి వెక్సిస్లు ఇతర మందులు కొనుగోలు పేరుతో ప్రభుత్వ డబ్బును దళారీ నిరంకుశ బూర్జువాలకు, సామ్రాజ్యవాదులకు ధారాదత్తం చేస్తుంది. వెక్సిస్లు ఇప్పటికి సగం డోస్ కూడ ప్రజలకు అందించలేదు.


తెలంగాణ ప్రభుత్వం సామ్రాజ్యవాదుల అనుకూల విధానాలను అమలు చేయడానికి, బీజేపీ ప్రభుత్వంతో కుమ్మకై లోపాయికారి ఒప్పందాలు చేసుకొని అన్ని బిల్లులకు ఆమోదిస్తూ అనులుచేస్తుంది. హరితహారం పేరుతో ఎన్నో ఏండ్లగా పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసులను అడవుల నుండి గెంటివేస్తూ మొక్కలు నాటుతున్నారు. అభయారణ్యాల పేరుతో గ్రామాలను కాలీ చేయబడచం, ఓపెన్ కార్డుల ద్వారా ప్రజలను విస్థాపనకు గురిచేయడం. నాలుగులైన్ల రోడ్ల విస్తరణ, అన్ని రంగాలను ప్రైవేటీకరించి ఉదోగ్యాలను తొలగిస్తున్నారు. దానికి వ్యతిరేకంగా పోరాడుతున్న జాస్వామిక లను, ఘాలతో పాటు కార్మిక-కర్మకులతో పాటు అన్ని ప్రజలను పోలీసు బలగాలతో అరెస్టులు చేస్తూ, జైళ్లలో పెడుతూ, హత్యలు చేసి అణిచివేస్తున్నారు.


సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో యాసత్తు పీడిత వర్గాలు, కార్మికులు, రైతులు, ఆదివాసులు, విద్యార్థులు, మహిళలు, యువజసులు,


మతపర అల్పసంఖ్యాకులు, ఉపాధ్యాయులు. డాక్టర్లు, లాయర్లు అన్ని సెక్షన్ల ప్రజలు సామ్రాజ్యవాద వ్యతిరేక, యుద్ధ వ్యతిరేక వారాన్ని ఘనంగా


నిర్వహించవలసిందిగా డివిజన్ కమిటీ పిలుపునిస్తుంది..

Share it:

TS

Post A Comment: