CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చినజీయర్ మీద ఎస్సి ఎస్టీ అట్రాసిటీ,దేశ ద్రోహం కేసు నమోదు చేయాలి.కొమురం ప్రభాకర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు :ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) డిమాండ్

Share it:

 


     


 

మన్యం మనుగడ,మంగపేట.

కాకతీయ యూనివర్సిటీ ఎస్డిఎల్సిఇ ముందర ప్రొఫెసర్.బియ్యాల జనార్ధన్ రావు చౌరస్తాలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) ,దాని అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో చిన జీయర్ దిష్టిబొమ్మను దహనం చేయటం జరిగింది.శ్రీ సమ్మక్క - సారాలమ్మ ఆదివాసీల ఆరాధ్యదైవం.ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు గావించింది.గిరిజన,గిరిజనేతరులు అనే ఎటువంటి భావం లేకుండా భక్తితో భక్తులను రక్షించుకునే కొంగు బంగారం. శ్రీ సమ్మక్క,సారాలమ్మ ,పగిడిద్ద రాజు,గోవిందా రాజు,జంపన్న,నాగులమ్మ ఇలా అనేక ఇలావేల్పులు ఉన్నాయి.ఆదివాసి సమాజాన్ని కాపాడిన వ్యక్తులుగా,తమ రాజ పరిపాలకులుగా చెపుతూనే,తమ దైవాలుగా నేటికి కొలవబడుతున్నారు.ఈ ఆదివాసీ సమాజానికి ఈ ఇలవేల్పు లే వారి ఇష్టదైవాలు గా కొలుస్తుంటారు.చిన జీయర్ అనే వ్యక్తి కులాలు,మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి తన యొక్క హిందూ భావజాల వ్యాప్తి లో భాగంగా తన వర్గాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివాసీ ప్రాంతాలను ఎంపిక చేసుకొని గత పది సంవత్సరాలుగా ఆదివాసి దైవాలను కించపరిచే విధంగా తన వ్యాఖ్యానాలు చేయడం సరైనది కాదు.బ్రహ్మ లోకం అంటూ తన భ్రమలను సమాజం పై రుద్దుతూ ప్రజలను భ్రమలో పెడుతూ తన విషపూరితమైన భావవ్యక్తీకరణ ప్రవచనాలను చెపుతున్నారు. మా ఆదివాసి దైవాల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తూ,తెలంగాణ రాష్ట్ర ప్రజల శాంతి భద్రతల యాక్టు పెడుతూ తెలంగాణ రాష్ట్రం నుండి బహిష్కరణ చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదివాసి హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) డిమాండ్ చేస్తుంది. 

ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు డాక్టర్.ఈసం సారయ్య కోయ దొరల సంఘం రాష్ట్ర బాద్యులు,చాప బాబు దొర ఆదివాసీ జాక్,మైపతి అరుణ్ కుమార్ ఆదివాసీ రాష్ట్ర నాయకులు,సిద్దబోయిన లక్ష్మీనారాయణ ఏటీఎఫ్ బుగ్గ బాబు కోయ దొరల సంఘం రాష్ట్ర నాయకులు,దబ్బకట్ల సుమన్ ఆదివాసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు,చంద మహేష్ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి, నాయకులు డాక్టర్.గొంది సత్యనారాయణ,చేల సత్యం,పెండకట్ల రాంబాబు,రామసహయం శ్రీనివాస రెడ్డి వైఎస్ఆర్టీపి ములుగు జిల్లా అధ్యక్షులు, కూన శివరాం,ఇర్ప సురేందర్,కల్తీ లక్ష్మయ్య సిద్దబోయిన అనిల్,వజ్జ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: