CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సంక్షేమ పథకాలను ప్రజలకు దగ్గర చేసింది టిడిపి నే :-నియోజకవర్గ సమన్వయ కర్త నరసింహులు.

Share it:

 


గుండాల మార్చి 29(మన్యం మనుగడ) ప్రజలకు సంక్షేమ పథకాలను దగ్గర చేసింది టిడిపి నేనని పినపాక నియోజకవర్గ సమన్వయకర్త ఇల్లందుల నర్సింహులు అన్నారు. మంగళవారం టిడిపి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని జెండా ఎగురవేసి అనంతరం ఆయన మాట్లాడుతూ. తెలుగుదేశం పార్టీ 40 వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. సతమతమవుతున్న ఏజెన్సీ ప్రాంతాల్లో కరెంటు, రోడ్లు, చెరువులను మంజూరు చేసి గ్రామాల అభివృద్ధికి బాటలు వేసింది అన్నారు. ప్రతి ఇ గ్రామంలో బడి ప్రతి మండల కేంద్రంలో ఆసుపత్రి మంజూరు చేసిన ఘనత టిడిపికే అన్నారు. రానున్న రోజుల్లో టీడీపీకి పూర్వ వైభవం రానున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు సాంబయ్య, కార్యదర్శి ఇల్లందుల అప్పారావు, గుండాల ఎంపీటీసీ సంధాని, మొల్కం మధు, మల్లయ్య , యాకయ్య, వగబాయిన రాములు, తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: