- వచ్చే వానాకాలం పంట కి బ్యాటరీ స్ప్రేయర్ లు పంపిణీ చేస్తాం....
- జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి
మన్యం మనుగడ, మంగపేట.
రైతులు రాయితీపై శిల్పాలిన్ పరదాలను పొందాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు. మంగళ వారం మండలంలోని అకినేపల్లి మల్లారం లో గల వికాస్ అగ్రి ఫౌండేషన్ కార్యాలయంలో రాయితీపై పరదాలను రైతులకు ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాంబశివ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు సాధికార విభాగం నుండి నలబై శాతం రాయితీపై శిల్పాలిన్ త్రీ డి పసుపుపచ్చ రంగు పరదాలను వికాస్ అగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నామని ఇందుకోసం రూపాయలు కోటి విలువైన పదాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు ఈ పరదాలను రైతులు పొంది ప్రస్తుత సీజన్ లో వస్తున్న అకాల వర్షాలనుండీ వ్యవసాయ పంటలను ఉత్పత్తులను రక్షించుకోవాలని రైతులకు సూచించారు ఒక్కో పరదా పొడవు 30 అడుగులు వెడల్పు 40 అడుగుల నిడివి 160 జి ఎస్ యం మంధం కలిగి ఉంటుందని తెలిపారు వివిధ రకాల సైజులను బట్టి పరదాల ధరలు ఉన్నాయని పరదాలు కావాలనుకునే రైతులు పట్టాదారు పాసుపుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్స్ అందజేసి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ఒక రైతుకు గరిష్ఠంగా నాలుగు పరదాలు మాత్రమే పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు పూర్తి వివరాలకు 9441304651 లేదా 9014404502 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని సూచించారు ములుగు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో ఒక్కో జిల్లాకు 1000 చొప్పున మొత్తం రెండు వేల పరదాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు వచ్చే వర్షాకాలం పంట నాటికి పర్యావరణానికి హిత కారకమైన బ్యాటరీస్ స్పేయర్ లను పంపిణీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిపారు ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు సుమారు రెండు వేల బ్యాటరీ స్ప్రేయర్లు సబ్సిడీపై కేంద్ర ప్రభుత్వం నుండి మంజూరయ్యే అవకాశం ఉందని సాంబశివ రెడ్డి వెల్లడించారు ఈ కార్యక్రమంలో స్థానిక రైతులతో పాటు వికాస్ అగ్రి ఫౌండేషన్ వైస్ చైర్మన్ పచ్చిపులుసు నరేష్ డైరెక్టర్లు శేషారెడ్డి తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: