CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

చేసిన సేవకు ఫలితం పురస్కారం.మహిళా దినోత్సవం రోజున సన్మానించిన స్త్రీ, శిశు సంక్షేమ శాఖ. అంగన్వాడీ కేంద్రాలకు కళ తెచ్చిన చంద్రకళ

Share it:

 





మన్యం మనుగడ, పినపాక: 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం తోగ్గూడెం పంచాయతీలోని ఆదివాసి గ్రామం టేకులగూడెం. పంచాయతి నుండి  ఐదు కిలోమీటర్ల దూరంలో అటవీ మార్గం గుండా కాలినడకన ప్రయాణిస్తే వచ్చే ఆదివాసి గ్రామం టేకులగూడెం. అలాంటి గ్రామంలో తనదైన శైలిలో సేవలందిస్తూ, 2021 వ సంవత్సరంలో కరోనా సమయంలోనూ తన అమూల్యమైన సేవలను ఆదివాసి గూడానికి అందించి కేంద్ర ప్రభుత్వం నుండి తమ అంగన్వాడీ కార్యకర్త పురస్కారం పొందింది. 2022  సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాదులోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో, కమీషనర్ దివ్య దేవరాజన్ సమక్షంలో  చంద్రకళను సన్మానించి లక్ష రూపాయల విలువ గల నజరానా అందించడం జరిగింది.

ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త కలం చంద్రకళ మాట్లాడుతూ, తన ఈ పురస్కారం రావడానికి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ నుండి లక్ష రూపాయల నజరానా రావడానికి, తనకు అన్ని విధాలుగా సహకరించిన సిడిపిఓ జయలక్ష్మి, సూపర్వైజర్ లకు తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. విలువైన సేవలను అందించాలంటే, సకాలంలో వస్తువులను తనకు చేరవేసి,  విజయంలో పాలుపంచుకున్న వ్యక్తి సిడిపిఓ జయలక్ష్మి అని తెలియజేశారు.

Share it:

TS

Post A Comment: