CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలి....

Share it:


మన్యం మనుగడ ,మణుగూరు:

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సారపాక ప్రెస్ క్లబ్ ఆఫ్ మన బూర్గంపాడు కార్యాలయంలో సమావేశం ఆదివారం జరిగింది .ఈ సందర్భంగా అధ్యక్ష ,కార్యదర్శులుడొంకన. చంద్రశేఖర్ మహమ్మద్ అబ్దుల్ ఘని మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.ఆర్ జర్నలిస్టులందరికీ కూడా ఇళ్ల మంజూరుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు . ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ములుగు ఎమ్మెల్యే సీతక్క జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు.ఇటీవలభద్రాచలం లో జరిగిన జర్నలిస్టుల సభ లో పాల్గొన్న ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఆయన మాట్లాడుతూ హామి ఇచ్చారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా ఎన్నో ఏళ్లుగాబూర్గంపాడు మండలం లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేదా డబుల్ బెడ్ రూమ్ లు మంజూరు చేయాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేశారు .ఎంతోమంది పేద జర్నలిస్ట్ కుటుంబాలు ఉన్నాయని వారందరికీ కూడా నిలువ నీడ లేని టువంటి వారు ఎంతో మంది ఉన్నారని వారికి ప్రభుత్వం చొరవ చూపిస్తూ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలంటూ కోరారు. బూర్గంపాడు మండల పరిధిలోని రెవెన్యూ అధికారులు స్థానిక ఎమ్మెల్యే రేగా కాంతారావు జర్నలిస్టుల ఇల్లు స్థలాలు మంజూరుపై ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని క్లబ్ సభ్యులు కోరారు.

Share it:

TS

Post A Comment: