CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పెంచిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలి.సిపిఐ ఎంఎల్ ప్రజాపంద మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి..

Share it:

 

 



 పెంచిన డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద మణుగూరు సబ్ డివిజన్ కార్యదర్శి ఆర్. మధుసూదన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ ప్రజాపందా పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు లో భాగంగా సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా మణుగూరు సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పెంచిన డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలకు నిరసనగా మణుగూరు సురక్షా బస్టాండ్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. పెంచిన డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలని నినాదాలు చేశారు.

             ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచకుండా ఎన్నికలు ముగిసిన వెంటనే పెట్రో, గ్యాస్ ఉత్పత్తి సంస్థలకు ధరలు పెంచుకోవడానికి అనుమతించిందని, గ్యాస్ పై ఏకంగా 50 రూపాయలు పెంచడంతో రాష్ట్రంలో గ్యాస్ ధర ఏకంగా వెయ్యి రూపాయలు దాటిందని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సందర్భంలో 500 రూపాయలు ఉన్న గ్యాస్ ధర ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో 1000 మార్కు దాటింది అన్నారు. ధరలను అదుపులో ఉంచుతా మని చెప్పిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుందని అన్నారు. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తి సంస్థలకు రోజువారీగా ధరలను సవరించుకునే అధికారం ప్రభుత్వం ఇచ్చిందని, దాంతో రోజుకు 70, 80 పైసలు చొప్పున పెంచుతూ పోతున్నారని అన్నారు. దీనివల్ల ప్రతి సరుకు రవాణా చార్జీలు పెరిగి, ధరలు పెరుగుతున్నాయన్నారు. పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా చెప్పకుండానే ధరలు పంచుతుంది అన్నారు. చిల్లర సమస్య పేరుచెప్పి ఆర్టీసీ చార్జీలను, విద్యుత్ చార్జీలను పెంచిందన్నారు. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి ధరలను పెంచుతూ సామాన్యులపై భారం మోపుతున్నారని, బ్రతక లేని స్థితిని కల్పిస్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల పై పోరాడాలని ప్రజలను కోరారు.

          ఈ కార్యక్రమం లో సిపిఐ ఎంఎల్ ప్రజా పందా మణుగూరు సబ్ డివిజన్ నాయకులు ఎండీ. గౌస్, వి. జానయ్య, పీ. సంజీవరెడ్డి, యాకయ్య, రాములు, ప్రభాకర్, వెంకటేశ్వర్లు, పాపారావు, సతీష్, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: