కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్ , డీజిల్, గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలు పెంచి పేదలపై మోయలేని అధిక ధరల భారం మోపిందని , పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని, సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోరా రవి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర పిలుపులో భాగంగా, న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం అశ్వాపురం మండలం మొండికుంటలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ , డీజిల్, వంట గ్యాస్ , నిత్యావసర వస్తువుల ధరలను, విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ, బొలెరో ట్రాలీ వాహనానికి తాడు కట్టి లాగుతూ నిరసన వ్యక్తం చేయడం జరిగింది .ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి మోరా రవి మాట్లాడుతూ గత రెండేళ్లుగా కరోనా మహమ్మారితో ప్రజలు సతమతమై ఉపాధి కోల్పోయి, అనేక రకాల ఆర్థిక ఇబ్బందులకు గురయ్యారని పేర్కొన్నారు. మరొకపక్క ఈ సంవత్సరం పంటలకు అనేక రకాల చీడ, పీడలు సోకి దిగుబడి తగ్గిపోయి చేతికి వచ్చిన పంటకు గిట్టుబాటు రేటు లేక , తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగి, దిక్కు తోచక, మాకు దిక్కెవరని ఎదురుచూస్తున్న, సన్న చిన్నకారు రైతాంగం, వ్యవసాయ కూలీలు, ఉపాధి కూలీలు ఆందోళన చెంది ఆవేదన చెందుతున్నారని , ఈ సమయంలో ప్రజలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు, సమస్యలను పరిష్కరించకపోగా, .దఫదఫాలుగా వంటగ్యాస్ డీజిల్ , పెట్రోల్ నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ వస్తున్న ప్రభుత్వాలు , మరొకసారి ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారాన్ని పెట్టి కేంద్ర ప్రభుత్వం తమ కార్పొరేట్ అనుకూల, ప్రజావ్యతిరేక విధానాల నిజ స్వరూపాన్ని ప్రజల ముందు నిరూపించుకుందని ఎద్దేవా చేశారు. అధికారం మీద , ఎన్నికల్లో గెలుపు పైన ఉన్న ప్రేమ, ప్రజల పైన , ప్రజా సమస్యలు పరిష్కరించటంలో లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలను విడనాడి, పెంచిన అధిక ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతుకూలి సంఘం మండల కార్యదర్శి బండ్ల వెంకటేశ్వర్లు, నూప మంగయ్య, రాజు , జోగయ్య , రమేష్ , బుజ్జయ్య , మహేష్ తరులు పాల్గొన్నారు.
రేపు , ఎల్లుండి జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి
జాతీయ కార్మిక సంఘాల పిలుపులో భాగంగా రేపు ఎల్లుండి జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని మోరా రవి పిలుపునిచ్చారు కార్మికవర్గం నిర్వహిస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సబ్ డివిజన్ పరిధిలోని అఖిల భారత రైతు కూలీ సంఘం , పీ వై ఎల్ ,పీవోడబ్ల్యూ, ప్రజా సంఘాల కార్యకర్తలు పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు
Post A Comment: