CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆటలతో స్నేహ భావం పెంపొందుతుంది.యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు.ఎడుళ్ళ బయ్యారం సిఐ రాజగోపాల్

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం : మండలపరిదిలోని అనంతరం గ్రామ పంచాయతీ పరిధిలో గల ముత్తారం గ్రామంలో కరకగూడెం మండలం వైస్ ఎంపీపీ పఠాన్ ఆయుబ్ ఖాన్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ భాగంగా ఆదివారం ప్రెస్ అండ్ పోలీస్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ఏడుళ్ల బయ్యారం సిఐ రాజగోపాల్ కరకగూడెం ఎస్ఐ గడ్డం ప్రవీణ్ కుమార్ పాల్గొని టాస్ వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆటలో గెలుపు ఓటములు సహజంగా ఉంటాయని ఓడిన గెలిచిన రెండు సమానంగా స్వీకరించాలని వారన్నారు. ఆటల వలన మానసిక దృఢత్వం స్నేహ భావం పెంపొందుతుందని అన్నారు. మొదట మ్యాచ్ ప్రేస్ పోలీస్ మధ్య జరిగిన పోటీలో పోలీస్ టీం పై ,ప్రెస్ క్లబ్ టీం ,విజయం సాధించింది ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహేష్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సీఐ రాజగోపాల్,ఎస్ఐ ప్రవీణ్ కుమార్,అందించారు. అనంతరం పినపాక ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బిల్లా నాగేందర్ కరకగూడెం ప్రెస్ క్లబ్ సభ్యులు దుర్గం ప్రేమ్,సురేష్ మాట్లాడుతూ పని భారం ఎక్కువ ఉన్నా శాంతి భద్రతల పరిరక్షణ లో నిరంతరం కష్టపడుతూ తీరిక లేకుండా ఉండి యువకులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వచ్చి మ్యాచ్ ఆడడం పోలీస్ టీమ్ కు పోలీస్ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని వారన్నారు. ఫ్రెండ్లీ పోలీస్ కు నిదర్శనం ఏడేళ్ల బయ్యారం సర్కిల్ పరిధిలోని పోలీస్ వారియర్స్ కు చెందుతుందని నిరంతరం గ్రామాలలో యువకులు ప్రజలతో మమేకం అవుతూ ఎక్కడ క్రీకెట్ మ్యాచి జరిగిన అక్కిడికివెళ్లి వారిని ప్రోత్సహించడం వారి పనితీరుకు నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రొఫెషనల్ ఎస్ఐ గణేష్ ఆర్ ఎస్ఐ సురేందర్ ప్రెస్ క్లబ్ సభ్యులు సుధాకర్ రెడ్డి, మహేష్,కోటి,సాయి, పోలీస్ సిబ్బంది. దాసు, దుర్గారావు,మహేష్,బిక్షపతి, లక్ష్మీనారాయణ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: