CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రేపల్లెవాడలో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం..

Share it:


  చండ్రుగొండ మన్యం మనుగడ ప్రతినిధి: పంచాయితీలో మౌలికసదుపాయాల కల్పనకు తనవంతుగా కృషి చేస్తానని రేపల్లెవాడ పంచాయతీ సర్పంచ్ కాక శ్రీను అన్నారు. మంగళవారం పంచాయతీ పరిధిలో రూ. ఐదు లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను ఆయన భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తండా, గుడెలను పంచాయతీలుగా చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కె దక్కుతుందన్నారు. పరిపాలన సామాన్యులకు అందేలా,అర్థమయ్యేలా చేయడమేప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు సత్తి నాగేశ్వరరావు, మార్తి సత్యనారాయణ, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: