CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోరాటాలతోనే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం:సి.ఐ.టి.యు.

Share it:

 మన్యం టీవీ మణుగూరు:


దేశ భక్తి ముసుగులో బిజెపి మోడీ ప్రభుత్వం భారతదేశం లోని లాభాల్లో నడిచే, ప్రభుత్వరంగ సంస్థలను మొత్తాన్ని,ప్రైవేటు పెట్టుబడిదారులకు కారుచౌకగా అమ్మి,దేశ సంపదను మొత్తం పెట్టుబడిదారుల చేతుల్లో పెట్టడానికి కంకణం కట్టుకున్నది అని,అందులో భాగంగా బొగ్గు పరిశ్రమను కూడా లాభాల్లో నడిచే దానిని ప్రైవేటు పెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నదని,దానిని తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా మార్చి 28,29 రెండు రోజుల దేశవ్యాప్త సమ్మె బొగ్గుగని కార్మికులు కూడా విజయవంతం చేయడం ద్వారానే కార్మికుల ఐక్యత చాటుకుని,ప్రభుత్వ రంగానికి కాపాడుకోగలమని సోమవారం మణుగూరు కెసీఎస్పీ లో జరిగిన మీటింగ్ లో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద. నరసింహారావు మాట్లాడుతూ, కార్మిక వర్గ పోరాటాలు దేశభక్తి పూరితమైన పోరాటాల్లో కార్మికులు పాల్గొని,దేశభక్తి చాటుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోడ్లు గా మార్చి,కార్మికులను కట్టు బానిసలుగా చేసేందుకు బిజెపి ప్రభుత్వం పూనుకుందని, అందుకే ఈ ప్రయత్నాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని,ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచి,ప్రజల కార్మికుల నడ్డివిరిచే ప్రయత్నం చేస్తున్నదని,కాంట్రాక్ట్ కార్మికుల కు కనీస వేతనాలు 26 వేల రూపాయల అమలుకు ఈ పోరాటాల ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని,అందుకు కాంట్రాక్టు పర్మనెంట్ కార్మికులు కూడా ఈ సమ్మెలో పాల్గొనాలని సంస్థ మనుగడకే ప్రమాదకరంగా రాబోతున్న తరుణంలో అధికారులు కూడా ఈ సమ్మెకు పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేయాలని, టీబీజీకేఎస్ ఈ సమ్మె పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేసిందని,కావున నూటికి నూరుశాతం సమ్మెను విజయవంతం చేయాలని ఆయన కార్మికులకు విజ్ఞప్తి చేశారు.బి ఎం ఎస్ ఈ సమ్మెలో పాల్గొనడం లేదని,ఇది రాజకీయ సమస్య అని, రాద్దాంతం చేయటాన్ని కార్మికులు గమనిస్తున్నారని,ఈ సమ్మెకు తూట్లు పొడిచే కార్మిక వర్గం కు తగిన గుణపాఠం చెప్పి తీరుతారని ఆయన హెచ్చరించారు.ఈ సమ్మెకు బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి అన్నారు. రైతు సంఘాలు,వ్యవసాయ కార్మిక సంఘాలతో పాటు అన్ని యూనియన్లు,అన్ని ఫెడరేషన్ లో ఈ సమ్మెలో పాల్గొన్న బోతున్నాయని గ్రామస్థాయి నుంచి,దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమలు సమ్మె చేయటం ద్వారా ఈ ప్రభుత్వాన్ని స్తంభింప చేసేందుకు అందరూ పూనుకోవాలి ఆయన కార్మికులకు,రైతులకు,ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ప్రైవేటీకరణ వల్ల ఎల్ఐసి లు,బ్యాంకులు, విమానాశ్రయాల,రైల్వేలు,తదితర ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులన్నింటినీ అమ్మటం ద్వారా,దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేసేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలను తిట్టు కొట్టాల్సిన అవసరం ఉందని ఆయన కోరారు.దేశ భక్తి ముసుగులో దేశ సంపదను విదేశీ సంస్థలకు కట్టబెట్టటం మేనా దేశభక్తి అంటే, ఇప్పటికైనా బీజేపీ నిజస్వరూపాన్ని అర్థం చేసుకొని,దేశభక్తి గల ప్రజలు, కార్మికులు ఐక్యంగా పోరాటం చేసి,ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని,రైతుల పోరాట స్ఫూర్తితో కార్మికవర్గం నడుం బిగించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ అధ్యక్షులు ప్రసాద్,బ్రాంచి నాయకులు లక్ష్మణ్ రావు, ఈశ్వర్ రావు,రామ్మూర్తి,విల్సన్ రాజు,బొల్లం.రాజు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: