CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ నియామకాల ప్రకటనల పట్ల హర్షం వ్యక్తం చేసిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి యన్ యన్ రాజు.

Share it:

 



మన్యం మనుగడ వెబ్ డెస్క్:

  ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా బుధవారం 80,039 ఉద్యోగ నియామకాలను ప్రకటించడం పట్ల టిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి యన్ యన్ రాజు హర్షం వ్యక్తం చేశారు.యావత్ తెలంగాణ నిరుద్యోగులు నాడు తెలంగాణ ఉద్యమంలో *నీళ్లు-నిధులు -నియామకాలు* ఈ మూడు నినాదాలతో యావత్ తెలంగాణ రాష్ట్రం కొట్లాడి రాష్ట్రాన్ని సాధించిందని అన్నారు, ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలంటే కోటి ఎకరాలను సస్యశ్యామలం చేయాలని భావించి అనేక ప్రాజెక్టులు నెలకొల్పి బీడు బుముల్లోకి నీళ్లను తెచ్చి ఆకుపచ్చ తెలంగాణను నిర్మించడమే కాకుండా, అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాడు. అదేవిధంగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే అక్కడ ఉన్నటువంటి నిధులతో రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలనే దృఢ నిశ్చయంతో అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అన్యాయం జరిగింది అందువల్లనే నియామకాలు అనే అంశం కూడా తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు న్యాయం జరగాలని వారి పక్షాన పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది .ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ కోట 20% ఉండటం వల్ల నిరుద్యోగులు తెలంగాణ విద్యార్థులు నష్టపోయినారు. అందువల్ల కొంత సమయం పట్టినప్పటికీ ఇప్పుడు ఓపెన్ ఐదు శాతం చేసి ,పూర్తిగా 95 శాతం స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా జోనల్ సిస్టమ్ పూర్తిచేశారు .ఈరోజు దాదాపు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయడమైనది .ఈ దేశ చరిత్రలో కేవలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కి ఈ ఘనత దక్కిందని ఆయన అన్నారు. యావత్ తెలంగాణ సమాజం ఈ ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చెయ్యడం జరిగిందని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు యన్ యన్ రాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Share it:

TS

Post A Comment: