CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

కరెంట్ చార్జీల పెంపుపై సి ఎం కెసిఆర్ దిష్టి బొమ్మ దగ్ధం.

Share it:

 


మన్యం మనుగడ, మంగపేట.

ములుగు జిల్లా మండలకేంద్రంలో శుక్రవారం భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల కృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సీ.ఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు దిష్టిబొమ్మ శవయాత్ర చేసి దహనం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు చింతలపూడి భాస్కర్ రెడ్డి ఈసందర్భంగా మాట్లాడుతూ.. పేద ప్రజలను దోచుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ చార్జీలు పెంచిందన్నారు. కరెంటు చార్జీల పెంపు దృష్టిని మళ్ళించడానికి టి.ఆర్.ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు గురించి కొత్త నాటకానికి తెరలేపారని అన్నారు.గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన పలు వాగ్దానాలు నిలబెట్టుకో లేక చేతగాని ప్రభుత్వంగా మారిందన్నారు. సామాన్య,పేద ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. గతంలో ఎన్నికల ముందు చార్జీలు పెంచని టిఆర్ఎస్ ప్రభుత్వం నేడు చార్జీలు పెంచి, పేద ప్రజల డబ్బులను దోచుకోవడానికి తెరాస ప్రభుత్వం కంకణం కట్టుకున్నదని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎల్లవేళలా పేద ప్రజలకు రైతు పక్షాన నిలబడుతుందని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ గోల్కొండ గడ్డ పై కాశయపు జెండా ఎగురవేస్తామన్నారు. అలాగే వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం వినకుండా కేంద్రాన్ని బధనాం చేస్తుందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తుదన్నారు. విద్యుత్ చార్జీల భారాన్ని మోపుతున్న టిఆర్ఎస్ ప్రభుత్వం పై పేద ప్రజలు తిరగబడాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి తాటి కృష్ణ, తెలంగాణా పాలసీ అండ్ రీసెర్చ్ ఇంచార్జి భూక్య రాజు నాయక్ , జిల్లా ఉపాధ్యక్షుడు అల్లే జనార్ధన్,జిల్లా ఉపాధ్యక్షుడు ఏనుగుల రవీందర్,జిల్లా కార్యదర్శి శ్రీలమంతుల రవీంద్రాచారి, జిల్లా అధికార ప్రతినిధి దొంతి రెడ్డి వాసుదేవ రెడ్డి, జిల్లా కార్యాలయ కార్యదర్శి చల్లురి మహేందర్,జిల్లా నాయకులు పోరిక ఉత్తమ్ కుమార్,ములుగు మండల అధ్యక్షుడు ఇమ్మడి రాజేష్ యాదవ్, తాడువాయి మండల అధ్యక్షుడు మల్లెల రాంబాబు,యువమోర్చా జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్,కిసనమోర్చా జిల్లా అధ్యక్షుడు జినుకల కృష్ణకర్ రావు, మైనారిటీ జిల్లా అధ్యక్షుడు యాకుబ్ పాషా, నాగుల్ మీరా, కిషన్ రావు,లోడే శ్రీనివాస్, చీకట్ల యకస్వామి, మల్యాల రవీందర్, గద్దల హరిబాబు, రామిడి సురేష్, ముంజంపల్లి మధు, దంతనపెళ్లి నరేందర్, ముత్తేబోయిన నరసింహారావు, అబ్బరబోయిన లక్ష్మణ్, రతన్ సింగ్, శ్రీనివాసాచారి, వెంగయ్య, యువమోర్చా జిల్లా కార్యదర్శి ప్రవీణ్ , మండల అధ్యక్షుడు అనుకుల అవినాష్ , దేవసింగ్ నాగసాయి , మహేష్ ,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: