CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో401మందికి ఉచితంగా కళ్ళజోళ్ళ పంపిణీ.

Share it:

 


  • రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా కళ్ళజోళ్ళ పంపిణీ
  • ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు,రేగా కాంతారావు
  • సుమారు 60 లక్షల రూపాయలతో ఉచిత కంటి ఆపరేషన్లు
  • నిర్విరామంగా కొనసాగనున్న ఉచిత కంటి ఆపరేషన్లు నియోజకవర్గంలో కంటి సమస్య లేకుండా చేయడమే లక్ష్యం 
  • కంటి ఆసుపత్రి నిర్మాణానికి నాలుగు ఎకరాల కేటాయింపు త్వరలోనే శంకుస్థాపన
  •  రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మణుగూరు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వైద్యపరీక్షల ఆసుపత్రి
  • 40 లక్షల రూపాయలతో అన్ని రకాల వైద్య పరీక్షలు, జనరల్ చెకప్ కోసం కావాల్సిన పరికరాలు సిబ్బంది నియామకం సిబ్బంది.
  • ఉగాది రోజు ఆస్పత్రి సేవలను ప్రారంభిస్తాం
  • రేగా బ్లడ్ బ్యాంక్ ద్వారా జిల్లా వ్యాప్తంగా సేవలను విస్తరింప చేస్తాం
  •  సామాన్య వ్యక్తి నీ అయినా నన్ను ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు విప్ రేగా

మేకల మహేష్ యాదవ్,మన్యం మనుగడ ప్రతినిధి:సామాన్య వ్యక్తి నీ అయినా నన్ను ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరికీ,అలాగే తనని ఇంతటి వాడిని చేసిన పినపాక నియోజకవర్గ ప్రజానీకానికి పినపాక ఎమ్మెల్యే, విప్,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ రేగా కాంతారావు అన్నారు.

 మణుగూరు మండలం లోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నందు రేగా విష్ణు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ కంటి చూపు సమస్యలతో బాధపడుతు కంటి ఆపరేషన్ పూర్తి చేసుకున్న 401 మందికి ఆయన చేతుల మీదుగా శనివారం వృద్ధులకు కళ్ళజోళ్ళ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రేగా మాట్లాడుతూ...సుమారు 60 లక్షల రూపాయల వ్యయం తో ఉచిత కంటి ఆపరేషన్లు నిర్వహించడం జరిగిందని ఈ ప్రక్రియ 

నిర్విరామంగా కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు.పినపాక నియోజకవర్గంలో కంటి సమస్య లేకుండా చేయడమే లక్ష్యం 

 కంటి ఆసుపత్రి నిర్మాణానికి నాలుగు ఎకరాల స్థలం కేటాయింపు త్వరలోనే జరుగుతుందని తెలిపారు.

 రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మణుగూరు టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వైద్యపరీక్షల ఆసుపత్రి

40 లక్షల రూపాయలతో అన్ని రకాల వైద్య పరీక్షలు, జనరల్ చెకప్ కోసం కావాల్సిన పరికరాలు సిబ్బంది నియామకం చేపట్టనున్నట్లు తెలిపారు.

ఉగాది రోజునఆస్పత్రి సేవలను ప్రారంభిస్తాం అన్నారు.

రేగా బ్లడ్ బ్యాంక్ ద్వారా జిల్లా వ్యాప్తంగా సేవలను విస్తరింప చేస్తాంని తద్వారా ఆపదలో ఉన్న అభాగ్యులకు సేవ చేసే భాగ్యం కలగ నుందన్నారు.

ఈ కార్యక్రమం లో

జడ్పిటిసి పొశం. నరసింహారావు,ఎంపీపీలు కారం విజయ కుమారి, గుమ్మడి గాంధీ,పిఎసిఎస్ చైర్మన్ నాగేశ్వరరావు,ఎంపీటీసీ బాబురావు సర్పంచ్ భారతి,డి సి హెచ్ ముక్కంటేశ్వరరావు, హాస్పిటల్ సూపరిండెంట్ గిరి ప్రసాద్,డాక్టర్ సంజీవ రావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యం బాబు, పట్టణ అధ్యక్షుడు అడపా అప్పారావు,నాయకులు భవాని శంకర్,వట్టం రాంబాబు,పార్టీ నాయకులు,మహిళ కార్యకర్తలు,యువజన నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: