CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

స్వామీజీ వ్యాఖ్యలు దురదృష్టకరం.

Share it:

 


ములకలపల్లి:మార్చి19(మన్యం మనుగడ)ప్రతినిధి:న్యూస్:

ఆదివాసీల ఇలవేల్పులైన సమ్మక్క- సారక్కలపై త్రిదండి చినజియ్యర్ స్వామి చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమని,తీవ్రంగా ఖండించదగినవని సీనియర్ జర్నలిస్ట్ యండి. ఉస్మాన్ ఖాన్ అన్నారు. ఎప్పుడు,ఎక్కడ,ఏసందర్భంలో చేసినా తప్పు తప్పేనని,సమయం గడిస్తే తప్పు ఒప్పుగా మారదని ఆయన అన్నారు.గతంలో కూడా స్వామీజీ బలహీన వర్గాల ఆహారపు అలవాట్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, బోధకుడి స్థాయిలో ఉన్నవ్యక్తులకు ఇలాంటి చిల్లర మాటలు శోభించవని పేర్కొన్నారు.అవి ఎప్పుడో ఇరవయ్యేళ్ళ క్రితం మాట్లాడిన మాటలని,వాటిని ఇప్పుడు తీసుకురావడమేమిటని జియ్యర్ స్వామి సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని, కాని ఈసమర్ధించుకునే ప్రయత్నం తన స్థాయిని దిగజార్చుతున్న విషయం ఆయన గ్రహించడం లేదన్నారు.తప్పులు దొర్లడం మానవ సహజమని,ఎప్పుడు మాట్లాడినా తప్పును తప్పుగా అంగీకరించి ఆదివాసీ జాతికి క్షమాపణ చెబితే,హుందాగా ఉంటుందని,గౌరవం పెరుగుతుందని, సమస్య సమసిపోతుందని అభిప్రాయపడ్డారు.

Share it:

TS

Post A Comment: