CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏజెన్సీ లో సి ఆర్ పి ఎఫ్, జీ/39 బెటాలియన్ మెగా హెల్త్ క్యాంప్.

Share it:

 


మన్యం మనుగడ వాజేడు/ 


ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పేరూరు G/39 బిఎన్, సి ఆర్ పి ఎఫ్ బెటాలియన్ ఆధ్వర్యంలో ఏజెన్సీ ప్రాంతమైన టేకులగూడెం గ్రామంలో కృష్ణాపురం సర్పంచ్, పూనెం నాగ చంద్ర, టేకులగూడెం సర్పంచ్, వాసం కృష్ణవేణి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మెగా హెల్త్ క్యాంప్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ మెగా హెల్త్ క్యాంప్ కార్యక్రమానికి, పలు గ్రామాలలో నుంచి గ్రామస్తులు భారీగా మెగా హెల్త్ క్యాంపు హాజరైనట్లు సి ఆర్ పి ఎఫ్ కమాండర్ రజినీకాంత్ పాండా తెలిపారు. నిరుపేద కుటుంబాలకు దోమతెరలు పంపిణీ చేశారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉండటం కోసం పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఔషధాలు పంపిణీ చేశారు. అలాగే సోలార్ లైట్లు, దేశ నలుమూలల నుండి సమాచారం తెలుసుకోవడానికి, రేడియోలు, గ్రామీణులకు అందజేశారు. ఏజెన్సీ గ్రామాలలో యువత పెడదారి పట్టకుండా సన్మార్గంలో నడవాలని వివిధ క్రీడా నైపుణ్యం కలిగిన యువకులకు ప్రోత్సాహకరంగా క్రీడా సామగ్రి వాలీబాల్ కిడ్స్, బ్యాడ్ మ్యాన్ కిట్లు, సెటిల్ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల విద్యార్థిని విద్యార్థులతో సాంకేతిక నృత్య ప్రదర్శన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సిఆర్పిఎఫ్ బెటాలియన్ కమాండర్ ఆర్కే పాండా, ఏటూర్ నాగారం ఏ ఎస్ పి అశోక్, కుమార్ ఐపీఎస్, సి ఆర్ పి ఎఫ్ వైద్య అధికారిని డాక్టర్ మానసా అసిస్టెంట్ కమాండెంట్ , G/39 బిఎన్ పేరూర్ క్యాంప్ అసిస్టెంట్ కమాండెంట్ వృషాలి జితేంద్ర హోబుల్,వెంకటాపురం, వాజేడు సీఐ కాగి తోచు శివ ప్రసాద్, ఎస్సై పోగుల శ్రీకాంత్,పేరూర్ డాక్టర్ మాధవి, టేకులగూడెం సర్పంచి, కృష్ణాపురం సర్పంచ్ నాగ చంద్ర, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: