CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సజావుగా సాగిన జెడ్ పి ములుగు సర్వసభ్య సమావేశం.జాతర నిర్వహణకి నిర్మణాత్మక సూచనలు.మన ఊరు మన బడి కార్యక్రమము పై విస్తృత చర్చ.

Share it:


  • బిపిన్ రావత్ మరణం పట్ల దిగ్బ్రాంతి సంతాపం ప్రకటన
  • పదిహేనవ ఆర్థిక సంఘం నిధుల ప్రణాళిక తయారు పై చర్చ
  • దలిత భందు అమలుపై చర్చ


మన్యం మనుగడ ములుగు బ్యూరో

జిల్లా ప్రజా పరిషత్ , ములుగు యొక్క సర్వ సభ్య సమావేశము శ్రీ కుసుమ జగదీశ్వర్ అధ్యక్షతన సజావుగా జరిగినది. సమావేశములో ప్రదానంగా విద్యా, వ్యవసాయం, మిషన్ భగీరథ, విధ్యుత్ శాఖ, హర్టీకల్చర్, పంచాయత్ రాజ్ ఇంజినీరింగ్, ఇరిగేషన్, యస్. సి సంక్షేమము , రోడ్లు మరియు భవనాలు మొదలగు శాఖల ప్రగతి పై సమీక్ష జరిపినారు. అతిపెద్ద గిరిజన జాతర మేడారం జాతర విజయవంతం చేయుటకు తగు సూచనలు జారీ చేసి యున్నారు. సమావేశములో గౌరవ సభ్యులు వారి వారి పరిదిలో ఉన్నటువంటి సమస్యలను సభ దృష్టికి తీసుకురాగా చైర్ పర్సన్ అధికారులు సమస్యల పరిష్కారానికి తగు సూచనలు, మార్గ నిర్దేశనము చేసినారు. జడ్పీ ముఖ్య కార్య నిర్వహణ అధికారి గారు పదిహేనవ ఆర్థిక సంఘం కి సంబంధించి 2022-23 సంవత్సరముకి సంబందించి తయారు చేయవలసిన ప్రజా ప్రణాళికా యొక్క నియమములు సభకి తెలియచేసినారు. సమావేశములో ములుగు, వెంకటాపూర్, వాజేడు, వెంకటాపురం (నూగూరు), కన్నాయిగూడెం జడ్పీటీసీ కొ-ఆప్షన్ వలియాబీ మండల ప్రజా పరిషత్ అద్యక్షులు , శ్రీమతి యస్. ప్రసూన రాణి, ముఖ్య కార్యనిర్వహణాధికారి, జడ్పీటీసీ ములుగు, ఉప ముఖ్య కార్యనిర్వహణ వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: