CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సుగంధ పంటల సాగుతోనే సమ్మిళిత వ్యవసాయాభివృద్ధి.జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి.

Share it:



  •  మిర్చి లో నాణ్యతా ప్రమాణాల పెంపు తోనే మార్కెట్లో మంచి ధర  

  •  స్పైసెస్ బోర్డు డిడి డాక్టర్ గాధి లింగప్ప

మన్యం మనుగడ ములుగు బ్యూరో 

ఆహార పంటల తో పాటు సుగంధ పంటల సాగుతోనే సమ్మిలిత వ్యవసాయ అభివృద్ధి సాధ్యపడుతుందని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు సోమవారం చర్ల మండల కేంద్రంలో స్పైసెస్ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన మిర్చిలో నాణ్యతా ప్రమాణాల పెంపు రైతు శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా సాంబశివ రెడ్డి మాట్లాడుతూ జాతీయస్థాయిలో వాణిజ్య ఎగుమతుల్లో సుగంధ పంటల ద్వారానే ఎక్కువ విదేశీ మారకద్రవ్యాన్ని మన భారతదేశం ఆర్జిస్తున్నదని తెలిపారు ప్రస్తుత సంవత్సరంలో తామర పురుగు సమస్యతో మిర్చి రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు తామర పురుగు నివారణ మరియు నిర్మూలన కనుగొనేందుకు జాతీయ స్థాయిలో ఉన్న శాస్త్రవేత్తల బృందాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో ఇప్పటికే పర్యటించి మిర్చి క్షేత్రాలు పరిశీలించడంతో పాటు ఎండుమిర్చి శాంపిల్స్ సేకరించిందని త్వరలోనే సమస్యలు పరిష్కారం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు మిర్చి రైతుల కోసం సబ్సిడీపై టార్పాలిన్ పరదాలు కామర్స్ మినిస్ట్రీ మంజూరు చేసిందని త్వరలోనే పంపిణీ ప్రారంభిస్తామని రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు స్పైసెస్ బోర్డు వరంగల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ గాధి లింగప్ప మాట్లాడుతూ మిర్చి లో నాణ్యతా ప్రమాణాల పెంపు కోసం ప్రత్యేక రైతు శిక్షణా కార్యక్రమాలను తమ స్పైసెస్ బోర్డు విరివిగా నిర్వహిస్తుందని తెలిపారు నాణ్యతా ప్రమాణాల పెంపు తోనే మార్కెట్లో మంచి ధర లభిస్తుందన్నారు సుగంధ రైతులు ఎగుమతి దారులు ట్రేడర్స్ కోసం తమ స్పైసెస్ బోర్డు వివిధ పథకాల ద్వారా సహకారం అందిస్తున్నట్లు వివరించారు త్వరలోనే మిర్చి రైతులను విజ్ఞాన యాత్రకు తీసుకెళ్తున్నట్లు తెలిపారు చర్ల వ్యవసాయ అధికారి శివరాం ప్రసాద్ మాట్లాడుతూ తామర పురుగు నివారణకు ప్రత్యేకమైన మందులేవి మార్కెట్లో లేవని అనవసరంగా బయో మందులు వినియోగించి రైతులు ఆర్థికంగా నష్టపోవద్దనీ సూచించారు మిర్చి క్షేత్రాల్లో జిగురు అట్టలు విధిగా వినియోగించాలని ఐపీఎం పద్ధతులు పాటించాలని నీమ్ ఆయిల్ 15 వేల పిపిఎం వాడాలని రైతులకు వివరించారు తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా అమలు పరుస్తున్న వివిధ పథకాలను రైతులకు వివరించారు ఈ కార్యక్రమంలో చర్ల సర్పంచ్ కొప్పుల కృష్ణ చర్ల ఎంపీపీ కోదండ రామయ్య జడ్పిటిసి శ్రీమతి ఇర్ప శాంత మరియు వ్యవసాయ అధికారి శివరాం ప్రసాద్ చర్ల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి అభ్యుదయ రైతులు మేడిచర్లసత్యనారాయణ రవి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: