CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పోడు భూముల ఆక్రమణలు ఆపాలి, సాగులో ఉన్న భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలి.సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోర రవి.

Share it:

     


 

                             

 మన్యం మనుగడ,అశ్వాపురం: టిఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూముల ఆక్రమణలు ఆపాలని, సాగులో ఉన్న పోడు భూములన్నిటికీ పట్టాలు ఇవ్వాలని, ఆదివాసి గిరిజన పేదలు సాగుచేసుకుంటున్న పోడు భూముల జోలికి ఫారెస్టు అధికారులు వెళ్లకుండా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని , టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ మణుగూరు సబ్ డివిజన్ కమిటీ కార్యదర్శి మోర రవి డిమాండ్ చేశారు. ఆదివారం సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో అశ్వాపురం మండలం మనుబోతులగూడెం గ్రామంలో గ్రామానికి సంబంధించిన పోడు భూములలో కందకం తవ్వడానికి వచ్చిన పోక్లెయినర్ యంత్రాలను ఆదివాసులు అడ్డుకోవడం జరిగింది ఈ సందర్భంగా మోర రవి మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంలో పోడు భూముల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ ప్రభుత్వం పోడు సాగు దారుల భూములకు పట్టాలు ఇవ్వకపోగా, ఎన్నో ఉద్యమాలు చేసి ఏ ప్రభుత్వాలు ఒక ఎకరం భూమి కూడా పంచి ఇవ్వకపోయినా, ఎందరో ఉద్యమ వీరుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న పోడు భూములను ఆక్రమించుకోవడం దుర్మార్గమన్నారు. కేసీఆర్ ప్రభుత్వం, పోడు భూములకు పట్టాలు ఇస్తామని, దరఖాస్తు చేసుకోవాలని చెప్పి, వెంటనే ఫారెస్టు అధికారులను ఉసిగొలిపి, సాగులో ఉన్న భూములను బలవంతంగా గుంజుకుని, ట్రoచి లు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో పక్క టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పోడు భూములు జోలికి వస్తే అడ్డుకోండని పిలుపునివ్వడం , వారి నిలకడలేని మాటలకు నిదర్శనమని అన్నారు. అధికారంలో ఉండి అడ్డుకోవాలని ప్రజలకు పిలుపునివ్వడం తో టిఆర్ఎస్ ప్రభుత్వం పోడు భూముల సమస్య పరిష్కరించలేదని భావించి ప్రజలు మరింత అభద్రత కు గురవుతున్నారని అన్నారు. ఫారెస్ట్ వారిని అడ్డుకుంటున్న క్రమంలో ప్రజలకు ఏం జరిగినా టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు బాధ్యత వహించాలని అన్నారు. రూలింగ్ లో ఉండి ప్రభుత్వం నుండి ఫారెస్ట్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా, ఇలాంటి మాటలు చెబితే టీఆర్ఎస్ నాయకులను ప్రజలు నమ్మరని అన్నారు. ఆదివాసులు సాగుచేసుకుంటున్న పోడు భూములను ఆక్రమించుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని, జల్ జంగిల్ జమీన్ హమారా నినాదంతో కొమరం భీమ్ , రాంజీ గోండు, ఆదివాసి వీరుల పోరాటాల స్ఫూర్తితో ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడి పోడు భూములు కాపాడుకునేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ ప్రభుత్వం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఫారెస్ట్ వారి దాడులను ఆపివేసి, పట్టా కోసం దరఖాస్తు చేసుకున్న పోడు సాగుదారులoదరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతుకూలి సంఘం మండల కార్యదర్శి బండ్ల వెంకటేశ్వర్లు, సోమయ్య, లక్మ , భద్రయ్య, ఇడమయ్య , రాజు , సోమయ్య , రమేష్ , లక్ష్మయ్య, బద్రి, మంగయ్య మంగయ్య ,మల్లయ్య, జోగయ్య ధర్మయ్య , లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: