CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

వనదేవత ల సేవలో తెరాస శ్రేణులు విరివిగా పాల్గొనాలని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ పిలుపు.

Share it:

 


మన్యం మనుగడ ములుగు.


ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో కొలువై ఉన్న ఆదివాసీ వన దేవతలు శ్రీ సమ్మక్క-సారక్క మహా జాతరకు వచ్చే భక్తులకు ములుగు జిల్లా పరిషత్తు చైర్మన్,టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కుసుమ జగదీష్ ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

సమ్మక్క సారక్క తల్లుల యొక్క ఆశీర్వాదాలు వచ్చిన భక్తులు అందరూ పొంది క్షేమంగా తిరుగు ప్రయాణం కావాలని,

పోలీసు వారికి,నిర్వహణ అధికారులకు ప్రతి ఒక్కరికి భక్తులు సహకారాన్ని అందించాలి అని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ కోరారు. 

వచ్చే భక్తులు సాదారణ దర్శనం చేసుకోవడమే సమ్మక్క సారక్కలకు ఇష్టమైన మొక్కుబడి,

కాబట్టి ప్రభుత్వం భక్తులకు సకల సౌకర్యాలు కల్పించారు.

సమ్మక్క సారక్క తల్లుల ముందు

అందరూ సమానమే.

ప్రతి ఒక్కరు సాధారణంగా దేవతలకు మొక్కుబడి చెల్లించాలి అని కోరారు. 

రెండు ఏండ్లకు ఒక్కసారి సమ్మక్క సారక్క తల్లుల వనం విడిచి జనంలోకి వస్తారు.

కనుక భక్తులు కోట్ల మంది తల్లుల దీవెనల కోసం తల్లి గద్దెల దగ్గరకు వచ్చి మొక్కులు చెల్లిస్తారు.

అధికారులు,పోలీసు వారు సమన్వయంతో జాతరకు వచ్చిన భక్తులకు ఆతిధ్యం ఇవ్వాలి అని కోరారు. సమ్మక్క సారక్క తల్లుల దర్శనం కోసం వచ్చిన భక్తులకు టీఆర్ఎస్ శ్రేణులు వాలంటరీ సేవ చేసి దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి అండగా

ఉండి తల్లల సేవలో తరించాలి అని కోరారు.మేడారంలో భక్తులకు అందుబాటులో ఉండి తల్లుల సేవలో నేను కూడా అందరితో పాటు ఉంటాను అని జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ తెలిపారు.

Share it:

TS

Post A Comment: