ములకలపల్లి:ఫిబ్రవరి15:(మన్యం మనుగడ)న్యూస్:
క్రీడ పాఠశాల హాక్కిం పేట,ఆదిలాబాద్,కరీంనగర్ నాలుగవ,ఐదవ తరగతులలో ప్రవేశాల కొరకు ప్రస్తుతం మండలంలో గల అన్ని యాజమాన్యలలో ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి,ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్యార్థులకు అదే తరగతు ప్రవేశం కొరకు విద్యార్థిని,విద్యార్థులకు ఎంపిక పరీక్ష కలదు.ఈ ఎంపిక లో పాల్గొన దలిచిన వారు,పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు 2, ఆధార్ కార్డ్, స్టడీ సర్టిఫికేట్, తీసుకొని ది:18-2- 2022ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ములకలపల్లి కి హాజరు కాగలరు ఈ పోటీ పరీక్షలకు హాజరగు విద్యార్థినీ విద్యార్థులు నాలుగో తరగతి లో ప్రవేశం కోరువారు 31-08-2012 నుండి 31-08-2013 మధ్యలో జన్మించిన వారై ఉండాలి, ఐదవ తరగతి లో ప్రవేశం కోరువారు 31-08-2011 నుండి 31-08-2012 మధ్యలో జన్మించిన వారై ఉండాలని, హాజరవుతున్న విద్యార్థులతో పాఠశాల ఉపాధ్యాయుడు కానీ వారి తల్లిదండ్రులు తోడుగా రావాలని ఎం ఈ ఓ.ఏ. శ్రీరామమూర్తి తెలియజేశారు ఈ విషయమై మండలంలో గల అన్ని యాజమాన్యాల వ్యాయామ ఉపాధ్యాయులకు సమావేశం నిర్వహించడం జరిగింది.
Post A Comment: